సింధియాకు స్వైన్ ఫ్లూ.. డిగ్గీరాజా హాట్ కామెంట్స్

Update: 2020-03-10 01:38 GMT
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 17మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. సీఎం కుర్చీ ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియా వారికి నేతృత్వం వహించి సీఎం కమల్ నాథ్ ను కూల్చే పనిలో పడ్డారు. ఈ పరిణామాలపై మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సెటైర్ల వర్షం కురిపించారు.

మధ్య ప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై దిగ్విజయ్ సింగ్ ను వివరణ కోరితే దిమ్మదిరిగేలా పంచులు వేశారు.‘సింధియాకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టుంది.. తమతో మాట్లాడటం వీలుకావడం లేదు’ అని సెటైర్లు వేశారు.

బీజేపీలో చేరబోతున్నరని తెలియడంతో డిగ్గీరాజా ఇలా సెటైర్లు వేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబం తో సన్నిహితంగా మెలిగిన సింధియా తనకు మధ్యప్రదేశ్ సీఎం పోస్టు దక్కకపోవడంతో ఇలా తిరుగుబావుటా ఎగుర వేశారు.
Tags:    

Similar News