రైతు గర్జనలు...'ఫీజు' ఉద్యమాలు...గడప గడపకూ కాంగ్రెస్ వంటి కార్యక్రమాలతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడుగా వెళుతున్నప్పటికీ ఆ ఫ్రేమ్ లో ఎక్కడా కనిపించని వ్యక్తి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి- రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ముందుండే డిగ్గీ ఎందుకు తెరమీదకు రావడం లేదంటే... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో గ్యాప్ రావడమే కారణం అంటున్నారు. వివిధ కారణాల వల్ల ఉత్తమ్ పదవి ఊడబీకేందుకు సిద్ధమైన డిగ్గీ అందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
టీఆర్ ఎస్ ప్రభుత్వానికి బలమైన ప్రత్యర్థి కోసం అధిష్టానం ప్రయత్నాలు సాగిస్తున్నది. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ - ప్రస్తుత ఎమ్మెల్సీ పీసీసీ పదవి కోసం దిగ్విజయ్ ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చైనా తాను బరిస్తానని, పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. దానికి అనుగుణంగా అధిష్టానం ఆయనతో మంతనాలు సాగిస్తున్నట్టు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా అధిష్టానం పెద్దలతో ఆయన భేటీ అయినట్టు తెలిసింది. ఎంపీగా పని చేసిన అనుభవంతోపాటు సహచర మాజీ ఎంపీలు కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్పు అనే చర్చ ఉన్నప్పటికీ అందులోకి దిగ్విజయ్ సింగ్ ఎంటరవడం అనేది ఆసక్తికరంగా మారింది. తన పదవి మార్పునకు డిగ్గీ సిద్ధమయ్యారని తెలియడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలవర పాటుకు గురైనట్టు తెలిసింది. సీటు కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బెంగతోనే పది రోజుల క్రితం ఆయన బెంగళూరు వెళ్లి దిగ్విజయ్ సింగ్ సంబంధికులను కలిసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పీసీసీ మార్పు తప్పదని కొంత మంది చెబుతున్నారు. దీంతో ఆయన ఎన్నికల వరకు కొనసాగే అవకాశం లేదని చెబుతున్నారు.
అయితే సదరు కొత్త నాయకుడి విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణ వచ్చిన రెండున్నరేళ్లు అయినా పార్టీ బలోపేతం కాలేదని అధిష్టానంతోపాటు మాజీ ఎంపీలు కూడా ఉత్తమ్ పై అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేస్తే రానున్న ఉప ఎన్నికలకు నాయకత్వం సిద్ధంగా ఉందా? అంటే నాయకుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతున్న కాంగ్రెస్...ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు దిక్కులు చూస్తున్నది. దీనికి సంస్థాగత వ్యవహరాలే కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం, ఇటీవల కార్యక్రమాలు పెరిగినా... ఆశించిన స్థాయిలో పార్టీ క్యాడర్ కు విశ్వాసం కల్పించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తున్నా... ప్రజలను కదలించలేకపోతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైన్ - మహారాష్ట్ర ఒప్పందం - రైతు దీక్షలు - మల్లన్నసాగర్ తదితర సమస్యలపై ఆందోళన చేస్తున్నప్పటికీ కార్యకర్తలు మినహా సంబంధింత బాధితులను కదలించలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కొన్ని పరిమితులు ఉండవచ్చు. ప్రాంతీయ పార్టీలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ప్రతి చిన్న విషయానికి అధిష్టానంపై ఆధారపడి ఉండడం కావచ్చు కానీ ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నది. టీపీసీసీ అధ్యక్షుడి నాయకత్వ పోరాటపటిమపై పార్టీ నాయకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి సీనియర్లు రాద్ధాంతం చేయడం - సీనియర్లను - జూనియర్ల నాయకులను ఏ విధంగా సమన్వయం చేయాలో తెలియడం లేదని చెబుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అసంతృప్తి రాక ముందే ఏం చేస్తామని ప్రతిపక్ష నేత సన్నిహితుల వద్ద అంటున్నారు. ఈ రకంగా ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడంతో వచ్చే ఎన్నికల తుఫాన్ ను ఎలా ఎదుర్కొంటారని పార్టీ నేతలు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/