మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్లీన్ ఇమేజి ఉన్న దిగ్విజయ్ సింగ్ అనంతర కాలంలో కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించినప్పటి నుంచి పూర్తిగా మారిపోయారు. ఫక్తు కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించడం మొదలు పెట్టారు. వ్యక్తిగత జీవితంలో వివాదాల సంగతి పక్కన పెట్టినా రాజకీయంగానూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం... తెలివిగా మాట్లాడుతూ ఇతర పార్టీల మధ్య చిచ్చులు రగిలించే ప్రయత్నాలు చేయడంలో సిద్ధహస్తుడని పేరు పడిపోయారు. తాజాగా ఆయన ప్రధాని మోడీపైకి టీ సీఎం కేసీఆర్ ను ఎగదోసే ప్రయత్నం చేశారు. ఇటీవల బీజేపీ తిరంగా యాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్ లో అమిత్ షా చసిన వ్యాఖ్యలను పట్టుకుని కేసీఆర్ ను ప్రశ్నించినట్లుగా ప్రశ్నిస్తూనే కేంద్రంపై విరుచుకుపడేలా చేయాలని ప్రయత్నించారు.
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అందిన రూ. 90 వేల కోట్లను ఏం చేశారన్న విషయాన్ని బయట పెట్టాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులకు రెండు రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిన సందర్భంగా దిగ్విజయ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న నిధులతోనే విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ ఎస్ కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల పేరు చెప్పి పేదల భూములను కేసీఆర్ సర్కారు కొల్లగొడుతోందని విమర్శలు గుప్పించిన దిగ్విజయ్ - తెలంగాణలో రైతు హక్కుల ఉల్లంఘన యదేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. 2013 నాటి భూసేకరణ చట్టాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని వివిధ మతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మొత్తానికి అమిత్ షా నిధుల ప్రకటనను కేసీఆర్ కు మరోసారి గుర్తు చేసి.. ఆ ప్రకటన కారణంగానే నీపై విమర్శలు చేస్తున్నామయ్యా బాబూ అన్నట్లుగా మాట్లాడి కేసీఆర్ ను బీజేపీపైకి ఉసిగొల్లే ప్రయత్నం చేశారు. కానీ.. కొద్దికాలంగా బీజేపీతో సయోధ్యకు ప్రయత్నం చేస్తూ.. ఆ ప్రయత్నంలో రోజురోజుకూ ప్రగతి సాధిస్తున్న కేసీఆర్ మాత్రం డిగ్గీ షేకింగులకు ఏమాత్రం చలించలేదు. కానీ... కేసీఆర్ కోరినట్లు రాష్ట్రాన్ని ఇచ్చిన తమను కాదని బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపుతుండడంపై మాత్రం డిగ్గీ చాలా అసంతృప్తిగా ఉన్నారట. అందుకే వారిద్దరినీ ఎలాగైనా కలవకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి.