డిగ్గీ వీడియో ఇప్పుడు వైర‌ల్‌...ఎందుకంటే?

Update: 2018-10-17 05:29 GMT
కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌ప్ప లాంటి వ్య‌క్తిగా దిగ్విజ‌య్ సింగ్ ను పోలిస్తుంటారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి త‌ర‌చూ వార్త‌ల్లో క‌నిపించినా.. కాంగ్రెస్ మీద ఆయ‌న‌కున్న అభిమానాన్ని ఎవ‌రూ త‌క్కువ చేసి చూప‌లేర‌ని చెబుతారు. త‌న రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉన్నా.. ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాట వెనుక అస‌లు మ‌ర్మం వేరుగా ఉంటుంద‌ని చెబుతారు.

అలాంటి డిగ్గీకి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌ధ్య ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. యాక్టివ్ గా ఉండి అధికార బ‌దిలీలో కీల‌క‌భూమిక పోషించాల్సిన డిగ్గీ..  ఇప్పుడు అందుకు భిన్న‌మైన మైండ్ సెట్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాకు అత్యంత స‌న్నిహితుడిగా డిగ్గీకి పేరుంది.

అయితే.. అమ్మ ద‌గ్గ‌ర ఉన్న ప్రాధాన్య‌త కొడుకు రాహుల్ ద‌గ్గ‌ర లేద‌ని చెబుతారు. ఇదే ఆయ‌న తాజా నిర్వేదానికి కార‌ణంగా చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌నకు చెందిన ఒక వీడియో క్లిప్ ఒక‌టి వైర‌ల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న ప్రాధాన్య‌త ఎంత మారింద‌న్న విష‌యాన్ని చెప్పే ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీకి కీల‌క‌మైన మ‌ధ్య ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో డిగ్గీ రాజా నోటి మాట‌లు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మార‌తాయ‌ని చెబుతున్నారు. నేను కానీ నోరు విప్పితే కాంగ్రెస్ ఓట్లు పోతాయ్.. అందుకే నేనుప్ర‌చారం చేయను.. ఇక మౌన‌మే నా భాష అంటూ ఆయ‌న త‌న అనుచ‌ర‌గ‌ణానికి చెప్పిన మాట‌ల‌తో కూడిన క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు తేల‌లేదు. వ్యంగ్య ధోర‌ణిలో చేశారా?  సీరియ‌స్ గా చేశారా?  నిర్వేదంతో చేశారా? అన్న‌ది క్లారిటీ లేదు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు చేసింది మాత్రం ఈ నెల 13న ఎమ్మెల్యే జితూ ప‌ట్వారీ ఇంట్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో అన్న విష‌యాన్ని చెబుతున్నారు. మ‌రి.. దీనిపై కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం దృష్టి సారిస్తుందా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

Watch Here : https://www.youtube.com/watch?v=k_wBTRZj9-0
Tags:    

Similar News