కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి పప్పులో కాలేశారు. వాస్తవాలు తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసి నవ్వుల పాలయ్యారు. గతంలోనూ ఓసారి ఇలాగే చేతులు కాల్చుకున్న డిగ్గీ రాజా.. మళ్లీ అదే తరహా పొరపాటు చేయడంతో ఆయనపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టాలన్న తొందరలో ఆయన నిజానిజాలు నిర్ధారించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. నిరుపయోగంగా పడి ఉన్న 108 వాహనాల ఫొటోను డిగ్గీ రాజా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఉన్న వాహనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ఫొటోతోపాటు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్ కు ఏం చేశారు..? అఖిలేశ్ యాదవ్ హాయాంలో ప్రారంభించిన 108 - 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అని అందులో ప్రశ్నించారు.
ఇక్కడే దిగ్విజయ్ పప్పులో కాలేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలోని అంబులెన్స్ లు ఉత్తరప్రదేశ్ వి కావు. ఆంధప్రదేశ్ కు చెందినవి. దీంతో డిగ్గీ నవ్వులపాలవుతున్నారు. దిగ్విజయ్ అబద్ధాల కోరు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా రివర్సవ్వడంతో ఇప్పుడు తల పట్టుకున్నారు డిగ్గి రాజా. గతంలో కూడా దిగ్విజయ్ ఓసారి ఇలాంటి పొరపాటే చేశారు. పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘భోపాల్ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, అది పాకిస్థాన్ కు చెందిన మెట్రో పిల్లర్ అని తేలడంతో.. చివరకు డిగ్గీ క్షమాపణలు చెప్పారు.