రాహుల్ గాంధీకి తీరని కోరికల జాబితాలో మొదటి నంబరు ప్రధాని పదవిదే. పెళ్లిగిళ్లీ వంటివన్నీ ఆ తరువాతే. ప్రధాని పదవి కోసం ఆయన, తల్లి సోనియా ఎంతగా తపిస్తుంటే అవకాశం అంతగా దూరమవుతోంది. కానీ... సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ చేసిన పొరపాటు పుణ్యమా అని రాహుల్ గాంధీ ప్రధాని కోరిక తీరిపోయింది. అదెలాగో చదవండి..
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజ్ కుమారి రత్నాసింగ్ రూపొందించిన ఓ వీడియోను దిగ్విజయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా రాజ్ కుమారి గురించి అక్కడ కొన్ని వివరాలు రాశారు. రాజ్ కుమారి ఎవరో కాదని... మాజీ మంత్రి దినేష్ సింగ్ కుమార్తె అని, ఆయన గతంలో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ కేబినెట్లలో పని చేశారని ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ ట్వీట్ తో దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అయ్యారో? ఆయన కేబినెట్ ఏమిటో అంటూ రాజకీయ నాయకులు, నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రాజీవ్ గాంధీ అనడానికి బదులు రాహుల్ అని ఆయన పొరపాటుగా రాయడంతో ఇదంతా జరిగింది. రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడానికి తనను బాధ్యుడిని చేసి విమర్శిస్తుండడం.. ప్రెజర్ పెంచుతున్న నేపథ్యంలో ఆయన మతి తప్పి అలా రాశారంటున్నారు. ఏదేమైనా డిగ్గీ చేసిన ఆ తప్పుతో రాహుల్ గాంధీ ఫుల్ ఖుషీ అయ్యారట. నిజజీవితంలో ప్రధాని వుతానో లేదో కానీ ట్విట్టర్లో మాత్రం తనను ప్రధానిని చేసి సంతోషపెట్టడంతో ఖుషీగా ఉన్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/