కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ టైం బాగున్నట్లుగా లేదు. వరుసగా ఆయనకు పోలీసులు - జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థల నుంచి చుక్కెదురు అవుతోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులకు-ఐసిస్ కు లింక్ పెట్టి ఆరోపణలు చేయడం ద్వారా విమర్శల పాలవడమే కాకుండా పోలీసుల దర్యాప్తు ప్రారంభించే పరిస్థితిని ఎదుర్కుంటున్న డిగ్గీకి ఇప్పుడు సీబీఐ రూపంలో షాక్ తగిలింది. వ్యాపమ్ స్కామ్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేసినందుకు డిగ్గీపై చర్యలు ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్ లో సీఎం శివరాజ్ సింగ్ పాత్ర ఉందని దిగ్విజయ్ సింగ్ గతంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై శివరాజ్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. వ్యాపమ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. పరీక్షల్లో డాక్యుమెంట్లు టాంపరింగ్‌కు గురికాలేదని వెల్లడయింది. కాగా, తనపై చర్యలు తీసుకుంటామని సీబీఐ ప్రకటించడాన్ని దిగ్విజయ్ స్వాగతించారు. అయితే అవినీతిపై తన పోరాటం ఆగదని ట్విటర్ లో దిగ్విజయ్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా తెలంగాణ పోలీసులపై డిగ్గీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా ఈ కేసులను సైతం దిగ్విజయ్ సింగ్ స్వాగతించడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/