మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక దాడి కేసులో సూత్రధారిగా భావిస్తూ స్టార్ హీరో దిలీప్ ను నాలుగు రోజుల కిందట కేరళ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐతే దిలీప్ అరెస్టుతో కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే దిలీప్ మేనేజర్ అప్పుణ్ని పోలీసులకు దొరకాల్సి ఉంది. అతడి ఆచూకీ తెలియడం లేదు. అతను తన స్వస్థలాన్ని వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. అతను కేరళలోనే లేడని.. తమిళనాడుకు వెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దిలీప్ అరెస్టవడానికి ముందే అప్పుణ్ని పారిపోయినట్లుగా తెలుస్తోంది. అతను దొరికితే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం చాలా లభిస్తుందని భావిస్తున్నారు.
దిలీప్ సినిమా వ్యవహారాలతో పాటు అతడి వ్యాపారాలు.. ఇతర వ్యక్తిగత విషయాలన్నింటినీ అప్పుణ్ని డీల్ చేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. హీరోయిన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా అతడికి అన్ని విషయాలు తెలుసని భావిస్తున్నారు. నటి కిడ్నాప్ జరగడానికి ముందు రోజు దిలీప్ ఎవరెవరితో మాట్టాడాడు.. ఏం చేశాడు.. అసలు పల్సర్ సునికి అతడికి మధ్య జరిగిన సంభాషణలు.. లావాదేవీలు అన్నీ అప్పుణ్నికి తెలుసని అంటున్నారు. పల్సర్ సునికి డబ్బులు చేర్చే బాధ్యతను కూడా అప్పుణ్నినే తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఓవైపు దిలీప్ ను విచారిస్తూనే.. అప్పుణ్ని కోసం కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను దొరికితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేస్తుందని భావిస్తున్నారు.