మనుషులు తప్పులు చేయటం.. వారు చేసిన పనికి ఫైన్లు వేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో పశువులు.. జంతువులకు ఫైన్లు వేస్తున్న వైనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మేకల గుంపులోని పది మేకలు.. కొన్ని మొక్కల ఆకుల్ని తినేశాయి. అంతే వాటిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటికి భారీ ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకూ అధికారులు అంతలా స్పందించటానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు కావటమే. నల్గొండ జిల్లా డిండి గ్రామ పంచాయితీకి చెందన మేకలు కొన్ని హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్ని తినేశాయి. దీంతో.. ఆ మేకల గుంపును అదుపులోకి తీసుకున్నారు.
వాటిలో పది మేకలకు.. ఒక్కో మేకకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ నిర్నయం తీసుకున్నారు. మొక్కలకు నష్టం వాటిల్లేలా చేసినందుకు మేకలకు ఫైన్ వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫైన్ మొత్తాన్ని చెల్లించకపోవటంతో.. వాటిని డిండి పంచాయితీ కార్యాలయం ఆవరణలో ఉంచేశారు. మొక్కల్లో హరితహారం మొక్కలన్న విషయం మేకలకు కాని.. వాటిని పెంచే యజమానులకు తెలిసేదెలా? అన్న క్వశ్చన్ కొందరి నోటి నుంచి వినిపిస్తోంది.