టీమిండియాలో అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ ఎవరంటే.. రోహిత్ శర్మనో, విరాట్ కోహ్లీనో అని చెప్పొచ్చు.. మరి తెలివైన క్రికెటర్ ఎవరు..? అంటే దీనికి కాస్త ఆలోచించాలి. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుర్ర పెట్టి ఆడేవారు. అందుకనే జట్టు ఓడినా వారి ఆటను తప్పుబట్టేందుకు అవకాశం ఉండేది కాదు. ఈ తరంలో చూస్తే అలాంటి బుర్ర ఉన్న క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పక తప్పదు. ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమై మ్యాచ్ చాలు.. అశ్విన్ ఎంత తెలివైన క్రికెటరో చెప్పొచ్చు. ఓవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న దినేశ్ కార్తీక్ ఔటయి.. మరోవైపు 1 బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో అశ్విన్ చూపిన నిబ్బరం మ్యాచ్ ను టీమిండియా పరం చేశాయి. అందుకనే అశ్విన్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా గొప్పగా ఆడాడని ఈ మ్యాచ్ లో వీర విహారం చేసిన కోహ్లీ కొనియాడాడు. అశ్విన్ విన్నింగ్ షాట్‌పై కోహ్లి ఇలా స్పందించాడు. కార్తీక్ ఔట్ అయ్యాక అశ్విన్‌కు కవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆడాలని కోహ్లి చెప్పాడు. కానీ, అతడు దానిని పరిగణిస్తూనే బుర్రకు పదును పెట్టాడు. వైడ్ అవుతుందని ముందే గమనించి.. షాట్ ఆడలేదు. బంతిని వదిలేసి లైన్ లోపలికి జరిగాడు. దీంతో ఒక పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. తర్వాతి బంతిని లాంగాఫ్ లోకి పంపి జట్టును గెలిపించాడు.
అతడలా ఆడకుంటే..ఆ మ్యాచ్ లో భారత్ ఓడి ఉంటే.. 37 ఏళ్ల వయసులో ఫినిషర్ గా జట్టులోకి పునరాగమనం చేసి.. పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఆ బాధ్యత పోషించాల్సిన సమయంలో దినేశ్ కార్తీక్ పేలవ ఔట్ అతడి కెరీర్ ను దాదాపు ముగించేసేదే. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్ మాత్రం తన తెలివిని ప్రదర్శించాడు. తాను కూడా ఓ స్పిన్నర్ కావడంతో మహమ్మద్ నవాజ్ వ్యూహాన్ని పసిగట్టాడు. తనను కూడా దినేశ్ కార్తీక్ తరహాలో వైడ్ బాల్‌కు బోల్తా కొట్టిస్తాడని గ్రహించాడు. వికెట్లను వదిలి స్ట్రైక్ తీసుకున్న అతను బంతి పడగానే దాన్ని గమనాన్ని గమనించి లోపలికి జరిగాడు. దాంతో ఆ బంతి కాస్త వైడ్‌గా మారి భారత్‌కు అదనపు పరుగు లభించింది. దాంతో చివరి బంతికి సింగిల్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క రన్ ఆపేందుకు పాక్ ఫీల్డర్లంతా సర్కిల్ లోపలికి రాగా.. అశ్విన్ మాత్రం.. సింపుల్‌గా లాంగాఫ్‌లో లాఫ్టెడ్ షాట్‌తో సింగిల్ తీసి మ్యాచ్‌ను ఈజీగా గెలిపించాడు. అశ్విన్ ఏ మాత్రం ఏమరపాటుకు గురైనా కోట్లాది మంది హృదయాలు ముక్కలయ్యేవి. కార్తీక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు.
అశ్విన్ మామ.. అందుకో అభినందన.. గొప్ప సంక్షోభం నుంచి తనను బయటపడేసిన తోటి తమిళనాడు క్రికెటర్ అశ్విన్ కు కార్తీక్ బహిరంగంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పెట్టింది. అది కాస్తవైరల్‌గా మారింది. అభిమానులేమో తమదైన వ్యాఖ్యలతో కార్తీక్‌ను ఆట పట్టిస్తున్నారు. వాస్తవానికి ఔట్ అయిన బంతి మినహా మ్యాచ్ లో కార్తీక్ ప్రదర్శన బాగుంది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సిన స్థితిలో తొలి బంతికి హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో అతడు క్రీజులోకి వచ్చాడు.
సింగిల్ తీసి విరాట్‌కు స్ట్రైక్ ఇవ్వగా.. అతను నో బాల్ ను సిక్సర్ కొట్గడంతో పాటు తర్వాతి బంతికి మూడు పరుగులు తీశాడు. దీనికి ముందు కూడా సింగిల్ వచ్చే చోట డబుల్ తీయడంలో, ఫ్రీ హిట్ కు మూడు పరుగులు తీయడంలో కార్తీక్ చురుకైన పరుగు చాలా ఉపయోగపడింది. అయితే, ఫ్రీహిట్ కు మూడు పరుగులు చేశాక తనకు స్ట్రైక్ రాగా. భారత విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కార్తీక్..స్టంపౌటయ్యాడు. గెలిపించాల్సిన పరిస్థితుల్లో ఇలా నిష్క్రమించడం కార్తీక్ ను దోషిగా నిలిపింది. అందుకనే అతడు.. అశ్విన్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
నిదహాస్ హీరో.. ఇప్పుడు జీరోనా??క్రికెట్ లో ఫలితాలే కాదు.. ఆటగాళ్ల కెరీర్ లూ అటుఇటు కావడం సాధారణం. ధోనీ కంటే ముందే టీమిండియాలోకి వచ్చినా.. దినేశ్ కార్తీక్ కెరీర్ 18 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులకు లోనైంది.
అయినా అతడు పట్టు వదలకుండా ఆడుతూ టీమిండియాలోకి వస్తూ పోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టి 37 ఏళ్ల వయసులో మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. ఇక 2018 నిదహాస్ ట్రోఫీకి ముందు కార్తీక్ సాధారణ ఆటగాడే. కానీ, శ్రీలంకలో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై చివరి ఓవర్లలో కార్తీక్ విశ్వరూపం చూపి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో తన పేరు మార్మోగింది.
కొసమెరుపు...: ఇప్పుడు చివరి ఓవర్లో జట్టును గెలిపించలేక విమర్శలు ఎదుర్కొన్న కార్తీక్ నిదహాస్ ట్రోఫీలో ఇదే పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడు. అప్పుడు నాన్ స్ట్రయికర్ గా ఉన్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్ షాట్లు కొట్టడంలో తడబడి జట్టును ఓటమి అంచులకు తీసుకెళ్లాడు. అయితే, కార్తీక్ గెలిపించి శంకర్ పరువు కాపాడాడు. ఇప్పుడు కార్తీక్ పేలవంగా ఔటైతే.. అశ్విన్ బాధ్యతను పూర్తి చేసి కార్తీక్ పరువు కాపాడాడు. ఇంకా విశేషమేమంటే.. నాడు కార్తీక్ కు శంకర్ ధన్యవాదాలు తెలపగా.. నేడు అశ్విన్ కు కార్తీక్ ధన్యవాదాలు చెప్పాడు. ఇంకా గమనార్హం ఏమిటంటే వీరు ముగ్గురూ తమిళనాడు వారే.