భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ .. తన భర్త, ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ పై సరదా వ్యాఖ్యలు చేశారు. ‘బాక్సింగ్ హుక్ పంచ్‌ను మా ఆయనకే ఇస్తా’ అంటూ ఆమె అన్నారు. ప్రస్తుతం దీపికా కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ సంస్థ అడిడాస్ ఇటీవల వాచ్ అస్ మూవ్ క్యాంపెయిన్ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, దీపికా పల్లికల్, 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కు హాజరయ్యారు. ఈ సందర్భం గా దీపికా .. నిఖత్, మానుషి మధ్య సరాదా సంభాషణ సాగింది.
ఈ సంభాషణలో భాగంగా.. బాక్సర్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. తన ఫేవర్ షాట్ హుక్ పంచ్ గురించి వివరించారు. ఆ తర్వాత ఆమె హుక్పంచ్ను మీరు ఎవరిపై ప్రయోగిస్తారు అంటూ దీపికాను ప్రశ్నించారు. దీనికి దీపికా తనదైన స్టైల్లో సమాధానం చెప్పింది. ‘ హుక్ పంచ్ ను నేను నా భర్త దినేశ్ కార్తీక్‌పై ప్రయోగిస్తా. ఎందుకంటే వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు కదా..! ఈ రోజే నేను ఇంటి కెళ్లాక ఈ హుక్ పంచ్‌ను నా భర్తపై ప్రయోగిస్తా’ అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యనించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు.
దీపికా భారత స్క్వాష్ క్రీడాకారిణిగా ఎన్నో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 2013లో ఆమె క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను వివాహం చేసుకున్నారు. పల్లికల్ కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. మూడు.. ఏషియన్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించింది. ఇక దినేశ్ కార్తీక్ 2019 వరకు టీమిండియా తరఫున ఆడాడు.
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చాలా కాలంగా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత ఏడాది అర్ధాంతరంగా కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. జట్టులో మాత్రం కొనసాగుతున్నాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్‌ను 2021 ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు.