సినిమా సమీక్షలపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కొందరు నిజాయితీగానే రివ్యూలు రాస్తున్నారని ఒప్పుకుంటూనే.. తమ సినిమాల విషయానికి వచ్చేసరికి ఏదో తేడా కొట్టేస్తుందని ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. సినిమా బావుంది అని రాస్తే ఒకలా.. బాలేదు అని రాస్తే ఇంకోలా ఎమోషన్ అయ్యే దర్శకనిర్మాతలు- హీరోలు మనకు ఉన్నారు. బావుందని రాస్తే హ్యాపీ ఫీలయ్యి.. బాలేదు అని రాస్తే తిట్టేసేవాళ్లకు కొదవేం లేదు. అయితే రెండిటినీ సమానంగా తీసుకునే వాళ్లు మాత్రం ఈ సెన్సిబుల్ ప్రపంచంలో చాలా చాలా అరుదు. కోట్లాది రూపాయలు వెదజల్లి సినిమాలు తీసే ఈ చోట ఇలాంటి ఎమోషన్ సర్వ సాధారణం.
`సీత` రిలీజవుతున్న వేళ ముక్కుసూటిగా మాట్లాడే తేజను ఇదే సంగతిపై ప్రశ్నిస్తే ఆయన్నుంచి అసక్తి రేకెత్తించే ఆన్సర్ నే వచ్చింది. ఆయన ఉన్నదున్నట్టు అనేశారు. సమీక్షకులు నిజాయితీగా రాయాలన్నా కంపెనీలకు ప్రకటనలు ఇవ్వకపోతే రాయలేరు అన్నారు. కమర్షియల్ అయిపోయింది ఈ ప్రపంచం.. ఒత్తిడిలో రాస్తున్నారని రివ్యూలు రాసేవాళ్లను సపోర్ట్ చేశారు. ఇందులో కొంత నిజం ఉందేమో కానీ మెజారిటీ పార్ట్ సమీక్షకులకు తమ సంస్థ ఉనికి.. క్రెడిబిలిటీనే ఇంపార్టెంట్. డబ్బులు - ప్రకటనలు తీసుకుని రాసేవాళ్లు లేరని అనలేం కానీ.. ఆ రెండే ప్రాతిపదికలు కావన్నది తెలిసింది తక్కువ మందికే. వీళ్లు సరిగా రాయలేదు అనుకుంటే ఏ రీడర్ ఇక అక్కడికి వెళ్లి చదవడు కదా! దానిని మాత్రమే స్ట్రిక్టుగా పరిగణించే రివ్యూ రైటర్లు మనకు ఉన్నారు. రివ్యూలు చదివే పాఠకులేం మూర్ఖులు కాదు. ఎవరు సరిగా రాస్తున్నారో వాళ్లవే చదువుతారన్నది మన మేకర్స్ కి తెలియాల్సిన అసలు పాయింట్.
కమర్షియల్ గా ప్రకటనలు తీసుకుని ``ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూ``లోనే రివ్యూలు రాసే కొందరు ఉంటారు కదా? పాజిటివ్ విషయాల్ని పాజిటివ్ గా.. నెగెటివ్ ఉన్నవి నెగెటివ్ గా యథాతథంగా రాస్తుంటాం కదా.. అని `తుపాకి` ప్రశ్నిస్తే.. అలా చాలా తక్కువ మంది ఉంటున్నారని అన్నారాయన. జర్నలిజంలో కొందరు ఎంతో నిజాయితీగా ఉంటారు.. కొందరి నిజాయితీ పీక్స్ లో ఉంటుంది. అలాంటివాళ్లను నెత్తిన పెట్టుకుంటాం! అంటూ జాతీయ స్థాయి జర్నలిస్టుల గురించి ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే జర్నలిజంలో కొందరు అమ్ముడు పోయేవాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించి వేడెక్కించారు. ఇంతకీ `సీత`పై ఎలాంటి రివ్యూలు రాబోతున్నాయి? అసలు అందులో కంటెంట్ ఎంత? కంటెంట్ లేకపోతే నెగెటివ్ గా రాసేవాళ్లపై తేజ స్పందన ఎలా ఉండబోతోంది? కాస్తంత వేచి చూడాల్సిందే. కాజల్- బెల్లంకొండ శ్రీను జంటగా తేజ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన `సీత` ఎలక్షన్ రిజల్ట్ నెక్ట్స్ డే.. అంటే ఈ శుక్రవారం (మే24న) రిలీజవుతోంది.