ఈ మధ్యన వెలుగు చూస్తున్న క్రైం షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఉన్న తీరుకు భిన్నంగా కొత్త పోకడలతో చోటు చేసుకుంటున్న ఉదంతాలు చూస్తే.. గతంలో మాదిరి ఒకరి మీద కంక్లూజన్‌కు రావటం ఏ మాత్రం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. మొన్నీమధ్యన షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక విషయాన్నే చూస్తే.. తనను వేధిస్తున్నారంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగి మీద ఆమె కంప్లైంట్ చేయటం.. అతన్ని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
ఈ వ్యవహారంపై యోగి రియాక్ట్ కావటం..విచారణ పేరుతో ఒక పోలీసు ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు వీడియో రూపంలో బయటకు రావటం.. సదరు అధికారిపై చర్యలు తీసుకోవటం లాంటివి జరిగిపోయాయి.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించి మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకూ తనను యోగి వేధిస్తున్నారని.. తన దగ్గర రూ.10వేలు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారంటూ హారిక వాపోయింది. తనకు అసభ్య మెసేజ్ లు పెట్టి యోగి తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా దర్శకుడు యోగి కొన్ని మొబైల్ స్క్రీన్ షాట్లను విడుదల చేశారు. హారిక తనకు పంపిన మెసేజ్ లను చూడాలని అతను కోరుతున్నాడు. ఇందులో.. తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని.. తనకు జీవితం మీద విసుగు వచ్చేసిందని.. ఫారిన్లో ఎంజాయ్ చేయాలని ఉండటం గమనార్హం.
సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలంటూ ఉన్న మెసేజ్ లో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. షీటీమ్స్ ఇంఛార్జ్.. మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తనను కాలితో తన్నినప్పుడు వీడియో తీసింది కూడా హారికేనని యోగి పేర్కొన్నారు. ఓపక్క యోగి తనను మేసేజ్ లతో వేధిస్తున్నాడని చెబుతూనే.. మరోవైపు..అతనికి ఈ రీతిలో మేసేజ్ లు పంపటం పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేయాలని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరి.. దీనిపై హారిక రియాక్షన్ ఏమిటో చూడాలి.