దారుణం : సైకిల్ లోనే కాలి బూడిదై కనిపించిన వికలాంగురాలైన గ్రామవాలంటీర్!

Update: 2020-12-19 16:49 GMT
గ్రామవాలంటీర్ వ్యవస్థ .. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ గ్రామవాలంటీర్ వ్యవస్థ. గ్రామవాలంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాల్ని అర్హులైన వారి ఇంటికి తీసుకురావడమే లక్ష్యం. అయితే , ప్రజల కోసం పనిచేసే గ్రామవాలంటీర్ల పై కూడా ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి. అలాగే మహిళా గ్రామవాలంటీర్ల పై అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే .. తాజాగా ఒంగోలు లో వికలాంగురాలైన ఓ గ్రామవాలంటీర్ ,మూడు చక్రాల సైకిల్‌లో కూర్చున్న స్థితిలోనే కాలి బూడిదై కనిపించింది. అయితే , ఆ యువతి ప్రమాదవశాత్తు మరణించలేదు అని, ఎవరైనా చంపి అక్కడ ఎవరికీ అనుమానము రాకుండా తగలబెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళితే, కమ్మపాలెం వాలంటీర్‌ గా పనిచేస్తున్న భువనేశ్వరి, నిన్న కూడా యధావిధిగా ఆఫీసుకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోయే సరికి తల్లి అప్పటికే రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసింది. మరో అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన కూతురు.. ఇలా కాలి బూడిదై కనిపించే సరికి ఆ తల్లి బోరును విలపిస్తోంది. నిర్మానుష్యంగా ఉండే దశరాజుపల్లి రోడ్డులోకి తనబిడ్డ ఒంటరిగా వచ్చే అవకాశం లేదని తల్లి చెబుతున్న మాట. మరి ఎవరు తీసుకెళ్లి ఉంటారు. వికలాంగురాలైన యువతిని చంపాల్సిన అవసరం ఏముందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలంలో హ్యాండ్‌ బ్యాగ్‌ తో పాటు యువతి ఆధార్‌ కార్డును గుర్తించారు పోలీసులు. అప్పటి వరకు కమ్మపాలెంలోనే ఉన్నానని తల్లికి చెప్పిన భువనేశ్వరి, రాత్రి 7గంటల తర్వాత ఎవరిని కలిసింది. ఎవరితో మాట్లాడిందన్న దానిపై తెలుసుకునే యత్నం చేస్తున్నారు. భువనేశ్వరి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా విచారిస్తున్నారు. ఎంబీఏ చదువుతూనే వాలంటీర్ ‌గా పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటోంది భువనేశ్వరి. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటుంది.
Tags:    

Similar News