డేవిడ్ వార్నర్.. పరిచయం అవసరం లేని విధ్వంసక బ్యాట్స్ మన్.. అన్నీబాగుంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుకు కెప్టెన్ అయ్యుండేవాడు. గొప్ప కెప్టెన్ గానూ చరిత్రలో
నిలిచిపోయేవాడు. కానీ, కాలం పగబట్టినట్లు..తెలిసి తెలిసి చేసిన తప్పు అతడిని కోలుకోలేని దెబ్బతీసింది. కెరీర్ పై తీవ్రంగా దెబ్బకొట్టింది. అదేమిటంటే.. బాల్ ట్యాంపరింగ్. 2018
దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాపరింగ్ కు పాల్పడినందుకు వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. అంతేకాదు.. మరెప్పుడూ కెప్టెన్సీ చేపట్టే వీల్లేకుండా నిషేధం అమలు చేస్తోంది. అయితే, దీనిని వార్నర్ భార్య క్యాండీస్ తప్పుపడుతోంది. తన భర్త మీద ఎందుకింత వివక్ష అంటూ సీఏను ప్రశ్నిస్తోంది.నాడు అవసరం లేకున్నా..
బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ జట్టు 2018 దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. అప్పటికి వార్నర్ వైస్ కెప్టెన్ కాగా, స్టీవ్ స్మిత్ కెప్టెన్. తొలి మ్యాచ్ లో గెలిచి మంచి
ఊపుమీదున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. అవసరం లేకున్నా ట్యాంపరింగ్ కు పాల్పడి పరువు పోగొట్టుకున్నారు. జేబులో బంతిని నునుపు చేసే కాగితం పెట్టుకుని వచ్చిన ఓపెనర్ బాన్ క్రాఫ్ట్ ..బంతిని దానితో గీకి పేసర్లకు ఉపయోగపడేలా చేయబోయాడు. అప్పట్లో ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనంతటికీ వార్నర్ మూల సూత్రధారిగా తేల్చారు. స్మిత్,వార్నర్ ను ఏడాది పాటు, బాన్ క్రాఫ్ట్ ను ఆర్నెల్లు నిషేధించారు. దీంతోపాటు వార్నర్ భవిష్యత్ లో కెప్టెన్సీ చేపట్టకుండా నిషేధం విధించారు. ప్రస్తుతం స్మిత్ కెప్టెన్సీకి ఎలాంటి అడ్డంకులు లేవు. సీఏ.. వార్నర్‌పై మాత్రం అలానే ఉంచింది. దాంతో యాషెస్ సిరీస్ సందర్భంగా ప్యాట్ కమిన్స్‌ను టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
దీతో క్యాండీస్ వార్నర్ తన భర్తకు చేస్తున్నా అన్యాయాన్ని నిలదీసింది. ట్రిపుల్ ఎమ్ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సీఏ పక్షపాత ధోరణిపై విరుచుకుపడింది. 'నాకు తెలిసి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్న 10 మ్యాచుల్లో ఒక్కటే ఓడాడు. కానీ అతని కెప్టెన్సీ నుంచి దూరం చేశారు. అన్యాయంగా అతన్ని సారథ్యాని దూరం చేశారు. పక్షపాత ధోరణితో నా భర్త పట్ల వివక్ష చూపుతున్నారు. వార్నర్ యూఏఈలో సారథ్యం వహించాడు.
ఐపీఎల్‌లో గొప్ప సారథిగా ఓ వెలుగు వెలిగాడు. అక్కడ ప్రజలు వార్నర్‌ను వాళ్ల సొంతవాడిలా అభిమానిస్తున్నారు. నా భర్త పనితీరు గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు..అతనికి ఉన్న మద్దతు గురించి చెబుతున్నాను' అని పేర్కొంది. 2018 లో వార్నర్ పై నిషేధం వేసినప్పుడు తనకు బోర్డు నుంచి ఇతరుల నుంచి కావాల్సిన మద్దతు అందలేదని క్యాండీస్ వాపోయింది. ఇదిలాఉండగా.. వార్నర్ పై ఉన్న లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ ను పున: పరిశీలించాలని సీఏ భావిస్తున్నది.
ఇందుకు సంబంధించి సీఏ చర్చిస్తున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సతీమణి, క్యాండిస్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త పట్ల వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించింది. తన భర్త ఏం పాపం చేశాడని పక్షపాత ధోరణిని చూపిస్తున్నారని, ఇది అన్యాయమని సీఏపై విరుచుకుపడింది. డేవిడ్ వార్నర్‌పై ఉన్న లీడర్‌షిప్ బ్యాన్‌ను వెంటనే ఎత్తేయాలని ఆమె డిమాండ్ చేసింది.ఉత్తమ సారథే..
డేవిడ్ వార్నర్ దూకుడైన బ్యాట్స్ మెనే కాదు.. మంచి కెప్టెన్ కూడా 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ అతడి సారథ్యంలోనే టైటిల్ కొట్టింది. అప్పటికి ఆ జట్టు తీవ్ర సంక్షోభంలో ఉంది. దానిని అధిగమిస్తూ.. వార్నర్ తన సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపించాడు. అప్పట్లోనే వార్నర్ పేరు మార్మోగింది. భవిష్యత్ ఆస్ట్రేలియా కెప్టెన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ, విధి మరోలా చూసింది. అతడి చేత బాల్ ట్యాంపరింగ్ అనే తప్పు చేయించింది. ఫలితంగా వార్నర్ కీర్తి మసకబారింది. ఇప్పుడు జట్టులోకి వచ్చిన వార్నర్ తనదైన స్థాయిలో ఆడుతున్నా ఇక కెప్టెన్సీ చేయలేకపోవడం అనేది ఎప్పటికీ లోటే.