ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడితో కేంద్రంలో నంబర్ టూ ప్లేస్ లో ఉన్న అమిత్ షా వంటి దిగ్గజ నేత భేటీ వేయడం అంటే ఆల్ ఇండియా లెవెల్ లో అది వైరల్ అయిపోయింది. ఏమిటి ఈ అనూహ్య భేటీ. ఈ ఇద్దరి మధ్య ఏమి చర్చ జరిగి ఉంటుంది, దీని వెనక రాజకీయం ఉందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. ఇంకా దీని మీద అలా వాడిగా వేడిగా డిస్కషన్ సాగుతూనే ఉంది.
ఎవరికి తోచిన విధంగా వారు ఈ భేటీకి మసాలాలు అద్దుతున్నారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని అయితే ఇది ఫక్తు రాజెకీయ భేటీ తప్ప మరేమీ కాదు అన్నారు. దీంతో బీజేపీకి వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీని మీద మాట్లాడుతూ జూనియర్ ఎన్టీయార్ తో అమిత్ షా మాట్లాడింది కేవలం సినిమాలా గురించి మాత్రమే సుమా అని చెప్పుకొచ్చారు. ఇందులో రెండో మాటే లేదు. రాజకీయాల గురించి అసలు చర్చ అంతకంటే లేదు అని క్లారిటీ ఇచ్చారు. జూనియర్ తో డిన్నర్ చేయాలని అమిత్ షా భావించారని, అలా భేటీ కూడా సాగిందని అన్నారు.
జూనియర్ ఎన్టీయార్ తో భేటీలో ఎక్కువగా సినిమాల మీదనే చర్చ వచ్చిందని, ఇక సీనియర్ ఎన్టీయార్ గురించి కూడా అమిత్ షా ఆసక్తిగా చాలా విషయాలు తెలుసుకున్నారని అన్నారు. అంతే తప్ప ఈ భేటీ మీద చిలవలు పలవలు ఎందుకు వస్తున్నాయో తెలియదు అన్నారు.
ఈ భేటీ మీద మాజీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ కి తాను ఏ విధంగానూ రియాక్ట్ కానని కిషన్ రెడ్డి చెప్పడం విశేషం. మరి కేంద్ర మంత్రి అంతా చెబుతూ కొడాలి కామెంట్స్ కి ఖండన ఎందుకు ఇవ్వడం లేదు అన్నది కూడా ఒక చర్చగానే ఉంది. కొడాలి నాని అన్నది ఎన్టీయార్ తో కచ్చితంగా రాజకీయ చర్చ జరిగింది అని. అది కాదు తప్పు అని చెబుతూనే ఆయన చేసిన దాని మీద నేరుగా రియాక్ట్ కాకపోవడంతో మరిన్ని డౌట్లు కి కేంద్ర మంత్రి అవకాశం ఇచ్చారా అన్న మాట వినిపిస్తోంది.
ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ఈ భేటీ మామూలిది కాదు, ఎవరూ ఊహించనిది. ఎందరో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తే ఆయన కోరి మరీ జూనియర్ ని పిలిచి డిన్నర్ చేయడం చాలా సేపు గడపడం అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అలాగే తెలుగు సినీ రంగంలో ఎందరో ప్రముఖులు ఉండగా జూనియర్ నే ఎంచుకుని డిన్నర్ భేటీ అని బీజేపీ వారు చెబితే డౌట్లు అన్నీ లేకుండా కాకుండా పోతాయా. ఏమో అసలు విషయం ఆలస్యంగా అయినా తెలుస్తుంది కదా అని అంటున్నారు అంతా.