తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒక విషయంలో సీమాంధ్రులు కూడా మెచ్చుకుంటున్నారు. ఉంటే కేసీఆర్ లాగే మొండిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు కారణం.. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అయుత చండీయాగాన్ని నిర్వహించడం.. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఐఏఎస్లు - ఐపీఎస్ లు తదితర అధికార నాయక గణాన్ని అంతటినీ భాగస్వాములను చేశారు. అయితే, ఇటు జన విజాన వేదిక నాయకులు కానీ అటు హేతు వాదులు కానీ మధ్యలో దళిత వాదులు కానీ కిక్కుమరనడం లేదు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే గళాలు విప్పుతున్నారు. అది కూడా యాగానికి వ్యతిరేకంగా కాకుండా కేసీఆర్ ఉద్దేశాలను ప్రశ్నిస్తూనే మాట్లాడుతున్నారు.
నిజానికి ఇదే యాగాన్ని చంద్రబాబు తలపెట్టారని అనుకుందాం. ఇప్పటికే జన విజాన వేదిక, హేతువాదులు తదితరులంతా కలిసి విమర్శల మీద విమర్శలు చేసేవాళ్లు. టీవీల వాళ్లు చర్చల మీద చర్చలు పెట్టేవాళ్లు. విశ్లేషణలు చేసేవాళ్లు. చంద్రబాబు యాగం చేస్తే మాత్రం.. ఆయన పిలిస్తే మాత్రం తగుదునమ్మా అంటూ వీళ్లంతా వెళ్లడం ఏమిటని వ్యాసాల మీద వ్యాసాలు రాసేవాళ్లు.
ఇక ఇదే యాగాన్ని ప్రధాన మంత్రి మోదీ చేస్తే ఇక దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు - హేతువాదులు - దళితవాదుల విమర్శలకు అంతే ఉండదు. ఈపాటికి మొత్తం ఒక వివాదం అయి కూర్చుండేది.
కానీ, కేసీఆర్ మిగిలిన నాయకుల్లా కాదు. ఆయన మొండివాడు. రాజు కంటే బలవంతుడు. ఎవరి మాటా వినని సీతయ్య. దానికితోడు ఇప్పుడు ఆయన అత్యంత బలశాలిగా ఉన్నాడు. ఆయనను కానీ చండీ యాగాన్ని కానీ విమర్శిస్తే తమకు ఎక్కడ మూడుతుందోనిన కమ్యూనిస్టులు, హేతువాదులు భయపడుతున్నారని, అందుకు ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. వారిని నోరు మూయించడంలో మాత్రం కేసీఆర్ విజయం సాధించారని హిందూ అనుకూల వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.