హిందూ మతంలోని ప్రతి చిన్న అంశాన్నీ ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. హిందూ మతంలో జరిగే పుష్కరాల నుంచి పూజల వరకూ ప్రతి ఒక్కరూ తప్పుపడతారు. కానీ, ముస్లిముల గురించి, వారి పండగల నుంచి.. క్రైస్తవుల గురించి వారి ఆచారాల గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరూ భయపడతారు.. హిందూ అనుకూల శక్తుల్లో ఎంతో కాలంగా గూడుకట్టుకుపోయిన అభిప్రాయమిది.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాగానే హిందూ అనుకూలుడు దేశాధినేత అయ్యాడని, ఇక హిందూ మతానికి ఉచ్ఛ స్థితి వస్తుందని ఆశ పడ్డారు. కానీ, ఆయన హిందూ మతానికి పెద్దపీట వేయకుండా లౌకిక వాదిగా ముద్ర పడడానికి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూ అనుకూల శక్తుల ఆశలన్నీ అడియాసలు అవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత చండీ యాగం నిర్వహించారు. తెలంగాణ కోసమా.. వ్యక్తిగతమా.. శత్రు సంహారం కోసమా.. ఆయన యాగం చేసిన ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అయుత చండీ యాగం చేశారు. యాగం ఎంత నిష్టగా నియమంతో చేయాలో.. దాని విధి విధానాలు ఏమిటో బహిరంగంగా ప్రకటించారు. యాగంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పాల్పంచుకుంది. యాగం తర్వాత తన సంకల్పం ఫలిస్తే త్రయుత చండీ యాగం చేస్తానని ఘనంగా ప్రకటించారు.
సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయినా సరే ఇలా ప్రకటించలేడనేది ఇప్పుడు హిందూ అనుకూల శక్తుల ప్రగాఢ భావన. మొండివాడు అయినా సరే.. కేసీఆర్ మాత్రమే అయుత చండి చేయడమే కాదు.. త్రయుత చండి చేస్తానని ప్రకటించాడని, అందుకే ఆయన దమ్మున్న ముఖ్యమంత్రి అని కొనియాడుతున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద అయినా పరిపూర్ణానంత అయినా ఇవే ప్రకటనలు చేశారు. ఎంతోమంది మనసులోని భావన కూడా ఇదే. కానీ, విచిత్రం ఏమిటంటే, కేసీఆర్ ముస్లిములకూ పెద్దపీట వేస్తారు. క్రైస్తవులకూ పెద్దపీట వేస్తారు. వ్యక్తిగతంగా హిందూ పూజలూ చేస్తారు. అదీ విషయం.