ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతపై సస్పెన్షన్ వేటు వేయటం ఏ మాత్రం సరికాదన్న వాదన ఒకటి తెరపైకి వచ్చింది. అసలు విపక్ష నేతపై వేటు వేయొచ్చా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కాల్ మనీ అంశంపై చర్చ జరపాలంటూ సభా కార్యకలాపాలు ముందుకు సాగనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ విపరీతంగా ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో సభలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అంబేడ్కర్ అంశం మీద చర్చ ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. విపక్ష సభ్యులతో పాటు.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సస్పెన్షన్ వేటు వేయటంపై మండిపడుతున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్షనేతపై సస్పెన్షన్ వేటు ఎలా వేస్తారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపై పలువురు నిపుణులు రియాక్ట్ అవుతున్నారు.
సభా కార్యకలాపాలకు అడ్డతగులుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం కాస్త భిన్నంగా వస్తోంది. ఇప్పటివరకూ అలాంటి సంఘటన చోటు చేసుకోలేదని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. విపక్ష నేతపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం లేదని.. ఈ విషయాన్ని గుర్తించే.. స్పీకర్ కోడెల శివప్రసాద్ విపక్ష నేత వైఎస్ జగన్ పేరును మినహాయించి మిగిలిన వారి చదవటమే దీనికి నిదర్వనంగా చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోనూ విపక్ష నేతను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కారు మాత్రం విపక్ష నేతపై తన జులుం ప్రదర్శించిందని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ వాదనపై ఏపీ అధికారపక్షం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో..?