మోడీ జ‌మానా..మాకు కొన్ని త‌ప్పులే క‌నిపిస్తాయి!

Update: 2017-04-10 09:44 GMT
స‌మ‌కాలిన రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి పేరుంది. ఆయ‌న నిర్ణ‌యాలు ఈ అభిప్రాయానికి కార‌ణంగా మారుతాయి. అదే స‌మ‌యంలో ఫ‌లితాలు సైతం బ‌లం చేకూరుస్తాయి. మార్పు రాజ‌కీయాల‌కు ప్ర‌తినిధిగా 2014లో ప్ర‌జ‌లు మోడీకి ఓటు వేశారు. అయితే ఇప్పుడు మోడీ కూడా మూస దోర‌ణుల‌ను అవ‌లంభిస్తున్నార‌ని, త‌న‌కు న‌చ్చిన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. త‌న‌వారు  త‌ప్పుచేసినా...స‌ర్వం మాఫీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా త‌మిళ‌నాడు ప‌రిణామాల‌ను చెప్తున్నారు. మోడీ ప్ర‌యోగాల‌కు త‌మిళ రాజ‌కీయాలు వేదిక‌గా మారాయని విశ్లేషిస్తున్నారు.

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం కార‌ణంగా ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌చ్చి ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం కాగా ఓట‌ర్ల‌కు డబ్బులు పంచుతున్నార‌న్న కార‌ణంగా ఎన్నిక ర‌ద్దు చేశారు. ఈ ప‌రిణామంపైనే ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారైతే విస్మ‌యం చెందుతున్నారు. డ‌బ్బులు పంచ‌డం అనేది నేరమే. అందుకు ఉప ఎన్నిక ర‌ద్దు స‌హేతుక‌మే. కానీ త‌మిళ‌నాడు ప‌రిణామాల‌కు కొద్ది రోజుల‌ ముందు ఆ ప‌క్క‌నే ఉన్న ఏపీలో ఏం జ‌రిగింది? స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డ‌బ్బును అధికార పార్టీ విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేసింది. ఓటు వేయాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులును వారాల త‌ర‌బ‌డి క్యాంపుల వెంట తిప్పింది. ఎట్ట‌కేల‌కు త‌ను అనుకున్న‌ట్లుగా సీట్లు గెలిచింది.

అంత‌కుముందు తెలంగాణ‌లో జ‌రిగిన ప‌రిణామం అయితే దేశం మొత్తం నివ్వెర‌పోయేలా చేసింది. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బేరం మాట్లాడారు. అంగ‌డి స‌రుకులాగా 5 కోట్ల‌కు ఎమ్మెల్యేను కొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌ను న‌మ్మిన బంటుతో రూ.50 ల‌క్ష‌ల అడ్వాన్స్ ఇప్పించారు. ఇదంతా నిగ్గుతేలిన‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రిపై ఇప్ప‌టికీ చ‌ర్య‌లు లేవు. బీజేపీ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదు. అదే స‌మ‌యంలో ఎన్నిక ఆగిపోలేదు. అంటే ఎన్నిక‌ల క‌మిష‌న్ కావాల‌నే కొన్ని చోట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిందా?  లేక‌పోతే ప‌లు చోట్ల జ‌రుగుతున్న జ‌రుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌పై మాత్ర‌మే మ‌నం స్పందించాల‌ని బీజేపీ నిర్ణ‌యం తీసుకుందా?  మార్పు రాజ‌కీయాల‌కు ప్ర‌తినిధి అయిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ ఇలాంటి సందేహాల‌కు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News