వాళ్లను కూడా కాల్చేయండి: చెన్నకేశవులు భార్య ధర్నా

Update: 2019-12-07 04:35 GMT
అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు నా మొగుడితో సహా నలుగురిని చంపారని.. ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధర్నా చేసింది. తన గ్రామస్థులతో కలిసి స్వగ్రామం రహదారిపై బైటాయించి తన భర్త శవాన్ని తనకే అప్పగించాలని.. ఇష్టమొచ్చినకాడ పూడ్చిపెట్టడానికి పోలీసులు ఎవరూ అంటూ ప్రశ్నించింది. చంపడం .. పూడ్చడం కూడా మీ బాధ్యత అని ఆమె కన్నీళ్ల పర్యంతమైంది.

ఈ సందర్భంగా నిండు గర్భిణి అని కూడా చూడకుండా తన భర్తను చంపారని.. పోలీసులపై తీవ్ర పదజాలంతో చెన్నకేశవులు భార్య విమర్శలు గుప్పించింది. ఈ ఎన్ కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీగా ఉన్నారని.. కానీ గతంలో ఇలాంటి ఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె ధర్నాలో డిమాండ్ చేసింది.

భర్త శవాన్ని తనకు అప్పగించకపోతే తనను కూడా ఆ గోతిలోనే పూడ్చిపెట్టాలని చెన్నకేశవులు భార్య పోలీసులను డిమాండ్ చేసింది. తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని చెన్నకేశవులు భార్య ఆరోపించింది.

ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని చెన్నకేశవులు భార్య రోధిస్తూ ఆవేదన వ్యక్తి చేసింది. దిశ చెల్లెలికి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని ఆమె పేర్కొంది. కేసులో కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తప్పు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను కూడా భర్తను చంపిన చోటే కాల్చేయండి అంటూ భోరుమంది. అనంతరం నడిరోడ్డుపై కూర్చొని గ్రామస్థులతో కలిసి ధర్నా నిర్వహించింది.


Full View

Tags:    

Similar News