సంచలనంగా మారిన దిశ హాత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరైన జొల్లు నవీన్ కు బైక్ ఉన్న సంగతి తెలిసిందే. తనకు నచ్చినట్లుగా మార్చుకొని.. ఇష్టారాజ్యంగా తన ఊళ్లో తిరిగే అతగాడి గురించి తెలిసిందే. బైక్ ముందు పుర్రె ఆకారంతో ఉన్న బొమ్మను బైక్ కు పెట్టుకోవటం.. సైలెన్సర్ తీసేసి.. పెద్ద శబ్దంతో వేగంగా దూసుకెళ్లటం.. లాంటి పనులతో స్వగ్రామంలో వ్యవహరించేవారు.
దిశ ఘటన జరిగిన తెల్లవారుజామున మక్తల్ మండం గుడిగండ్ల గ్రామానికి బైక్ మీదనే వచ్చాడు. దిశ హత్యాచారం చేసిన తర్వాత.. ఆమె దేహాన్ని కాల్చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు బైక్ ను ఉపయోగించాడు. పొద్దున్నే నిందితుడ్ని గుర్తించటంతో ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.
ఆ సందర్భంగా అతడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బైక్ ను మక్తల్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. తాజాగా ఈ కేసు విచారణ షాద్ నగర్ పోలీసులు చేస్తుండటంతో.. బైక్ ను షాద్ నగర్ తరలించారు. అరెస్టు చేసిన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించటం.. విచారణలో భాగంగా ఘటనాస్థలానికి తీసుకొచ్చిన సమయంలో పోలీసుల మీద దాడికి ప్రయత్నించి ఎన్ కౌంటర్ కావటం తెలిసిందే.