ఏపీ...యూపీ...ఎంపీ....ఇలా రాష్ట్రమేదైనా....మహిళలపై లైంగిక వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మృగాళ్ళ లైంగిక వేధింపులు....అసభ్యకర ప్రవర్తన నుంచి మహిళలను కాపాడేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ తరహా కేసులను మరింత సత్వరమే పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ చట్టంతో పాటు, దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఏదో నామ్ కా వాస్తే అన్నట్లు కాకుండా....దిశ టీం యాక్షన్ ప్రారంభించింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే తొలి సక్సెస్ నమోదైంది. బస్సులో ప్రయాణిస్తోన్న ఓ మహిళా అధికారిణిని వేధిస్తున్న కామాంధుడిని దిశ టీం అదుపులోకి తీసుకుంది. ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే ఆ ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్ ఆనందంతో తన కరతాళ ధ్వనుల ద్వారా పోలీసులను అభినందించారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ మహిళా అధికారికి బస్సులో వేధింపులు ఎదురయ్యాయి. మంగళగిరి దిశ కాల్ సెంటర్‌కు ఆ మహిళ ఎస్‌వోఎస్ కాల్ చేశారు. సమీపంలోని ఎమర్జెన్సీ టీంకు కాల్ సెంటర్ ఉద్యోగులు సమాచారం అందించారు. SOSకి కాల్ వచ్చిన 6 నిమిషాల్లోనే మంగళవారం తెల్లవారుజామున 4.27కు ఏలూరు వద్ద ఆ ఆకతాయిని దిశ టీం అదుపులోకి తీసుకుంది. స్పందన రివ్యూ సందర్భంగా ఈ ఘటనను ఏపీడీజీపీ గౌతామ్ సవాంగ్ సీఎం జగన్‌కు చెప్పారు. అది విన్న జగన్ ఆనందంతో చప్పట్లు కొట్టారు. సత్వరమే స్పందించిన దిశ టీం, పోలీసులను సీఎం జగన్ అభినందించారు.