భయపెడుతున్న మరో బడా కంపెనీ లేఆఫ్స్

Update: 2023-03-28 19:52 GMT
ఇప్పటికే ట్విటర్ మొదలుపెట్టిన తొలగింపుల పర్వాన్ని మెటా (ఫేస్ బుక్), అమెజాన్ , గూగుల్ అందిపుచ్చుకున్నాయి. ఇక కార్పొరేట్ కంపెనీలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. లేఆఫ్స్ పేరుతో ఇంటికి పంపుతున్నాయి. ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనూ ఈ లేఆఫ్స్ మొదలు కావడం కలకలం రేపుతోంది.

ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ పేరు తెలియని వారు ఉండరు. డిస్నీ సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అయితే మాంద్యం దెబ్బ ఈ సంస్థకు కూడా తాకింది. తాజాగా డిస్నీలో 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. డిస్నీ ఎంటర్ టైన్ మెంట్, పార్మ్స్ విభాగాల ఉద్యోగులు కానున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఉద్యోగులకు గుడ్ బై చెప్పనుంది. ఈ మేరకు డిస్నీ సీఈవో జాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు ఈమెయిల్ లో తెలియజేశారు.

5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చుల ఆదా, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో జాబ్ ఇగర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసింేద.

ఇటీవల డిస్నీ సబ్ స్కైబర్స్ సంఖ్య భారీగా పడిపోయింది. అటు గత మూడు నెలల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు సైతం ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News