ఏపీలో బీజేపీ - టీడీపీల మధ్య అంతరం పెరుగుతోందన్నది కాదనలేని సత్యం. ఉన్నతస్థాయిలో రెండు పార్టీల నేతలు సంయమనం పాటిస్తూ... తమ అధిష్ఠానాల కోరిక మేరకు కిమ్మనకుండా ఉంటున్నారు. ఒకరిపై ఒకరికి ఎన్ని అసంతృప్తులు ఉన్నా వాటిని కడుపులోనే దాచుకుంటూ.. లోలోన రగిలిపోతున్నా బయటకు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. కానీ... స్థానిక క్యాడర్ మాత్రం బయటపడిపోతుంది. తాజాగా... పశ్చిమగోదావరిలో అదే జరిగింది.
ఏపీ దేవాదాయ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం - బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య గొడవ రాజుకుంది. మున్సిపల్ సమావేశంలో టిడిపి - బిజెపి కౌన్సిలర్ లు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ ముదిరిపోయిందని తెలుస్తోంది. దీంతో గూడెం మున్సిపల్ ఛైర్మన్.. ఇక బీజేపీతో కలిసి ఉండలేమని చెప్పేసినట్లు సమాచారం.
మున్సిపల్ సమావేశంలో రెండు పార్టీల కౌన్సిలర్ లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. టీడీపీ అన్యాయ చేస్తోందంటూ బీజేపీ... రాష్ట్రాన్ని అనాథ చేస్తున్నది బీజేపీయే అంటూ టీడీపీ కౌన్సిలర్ లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. కడుపులో ఉన్న కోపమంతా కక్కేసుకుంటూ మాటల దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా... టీడీపీ వాళ్లయితే డైరెక్టుగా తమ మనసులో మాట చెప్పేశారు. బీజేపీతో కలిసి ఉండే పరిస్థితి కనిపించడం లేదని గూడెం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారట.
... మరి ఇంతజరిగాక దీనిపై టీడీపీ - బీజేపీ అధిష్ఠాణాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. చంద్రబాబు ఏమంటారో.... బీజేపీ మంత్రులు - పార్టీ అధ్యక్షుడు ఏమంటారో చూడాలి. మొత్తానికి ఇది తాడేపల్లి గూడెం మున్సిపాలిటీ స్థాయి వ్యవహారమని కొట్టిపారేసినా రాష్ట్ర స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉందన్నది అందరికీ తెలిసిందే.