మహాకూటమిలో సీట్ల చిచ్చు

Update: 2018-09-27 06:06 GMT
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని - కె. చంద్రశేఖర రావును గద్దె దించేందుకు ఏర్పడుతున్న మహాకూటమికి ఆదిలోనే కష్టాలు ఎదురౌతున్నాయి. ఈ మహాకూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై మిగిలిన పార్టీలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో విబేధాలు తలెత్తుతాయని అంటున్నారు. ఏ పార్టీకాపార్టీ తమకు ఇంత బలముంది.....ఇన్ని సీట్లు కావాలి అని పట్టుబడుతున్నాయి. దీంతో మహాకూటమికి బీటలు పడతాయా అని సందేహాలు వస్తున్నాయి. మహాకూటమిలో పెద్ద పార్టీ  అయిన కాంగ్రెస్ సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అక్టోబర్ మొదటి వారంలో తమ అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అలాంటప్పుడు మహాకూటమిలో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దులను ఎలా ప్రకటిస్తుందని కూటమిలోని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే తామూ తమ అభ్యర్దులను ప్రకటిస్తామని చెబుతున్నాయి. మరోవైపు మహాకూటమిలోని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని  అంగీకరించటం లేదని అంటున్నారు.

మహాకూటమిలో భాగస్వామ్యులైన కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలు ఒక్కసారి కూడా కలసి చర్చించుకున్న దాఖాలలు లేవు. ఇంత వరకూ ఏ రెండు పార్టీలకు చెందని నాయకులు కలుసుకున్నారు తప్ప అందరూ ఒకేసారి - ఒకే వేదికగా సీట్ల సర్దుబాటు - వ్యూహాలు - బహిరంగ సభల నిర్వాహణ వంటి అంశాలపై చర్చించ లేదు. మరోవైపు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులు ప్రకటన - బహిరంగ సభల నిర్వాహణ వంటి అంశాలతో దూకూడు మీద ఉంది. మహాకూటమిలో ఇంకా ఏవీ ఓ కొలిక్కి రాలేదు. ఇవి ఆయా పార్టీల నాయకుల - కార్యకర్తలపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో అన్నీ పార్టీలు కలసి అధికారంలోకి వస్తే ఈ కష్టాలు మరింతా పెరుగుతాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీసారి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇస్తాం - వీటిలో పోటి చేయండి అని ప్రకటించడంపై కూడా మహాకూటమిలోని పార్టీలకు నచ్చటం లేదు. అందరూ కూర్చుని సీట్ల సర్దుబాటుపై చర్చించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఇన్ని సీట్లు ఇస్తాం అంటూ చెప్పడం ఆ పార్టీ ఆదిపత్యాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. మొత్తానికి మహాకూటమి పురిటి దశలో ఇబ్బందులు పడుతోందని - ముందు  - ముందు  పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News