దిల్ ఉన్న కంపెనీ దివీస్

Update: 2016-08-16 22:30 GMT
వేల కోట్ల ఆదాయం ఉన్నా ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే నానా నరకం చూపించే కంపెనీలు ఉన్న కాలంలో ఫార్మా కంపెనీ దివీ ల్యాబ్సు తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులు - డైరెక్టర్లకు ఏకంగా 80 కోట్ల బోనస్ ప్రకటించింది. ఈ మొత్తానికి ఉద్యోగులు - శాశ్వత డైరెక్టర్లు అందరికీ చెల్లించనుంది.  మొత్తం రూ.79 కోట్లను ఒక-సమయం చెల్లింపుగా   ఉద్యోగులు - శాశ్వత డైరెక్టర్లకు స్పెషల్ పేమెంట్ కింద లబ్ధి పొందనున్నారు.

ప్రసుతం దివీ ల్యాబ్సులో 10 వేల మందికిపై ఉద్యోగులు పనిచేస్తున్నారు. రీసెంటుగా దివీస్  మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ. 302 కోట్లను కోట్లకు  పెరిగి మార్కెట్ల అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేసింది.  అమ్మకాల్లో 25 శాతం వృద్ధి   సాధించి రూ 1,006 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక నిర్వహణ లాభ మార్జిన్లు 2.68 శాతం దూసుకెళ్లి 37.32 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో దివీస్‌ కౌంటర్‌ కు భారీ డిమాండ్‌ ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  దీంతో  దివీస్  ల్యాబ్ షేరు 7 శాతానికి పై గా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది.

దివీస్ ల్యాబ్స్ ను1990లో స్థాపించారు. 25 ఏళ్లు ఇప్పటికే పూర్తయింది. పైగా కంపెనీకి భారీ లాభాలు వస్తుండడంతో ఉద్యోగులను ఖుషీ చేయడానికి కంపెనీ రెడీ అయింది. అందులో భాగంగానే భారీ నజరానా ప్రకటించింది. దీంతో చిన్న ఉద్యోగులకు కూడా లక్షల్లో బెనిఫిట్ కలగనుంది. దేశవ్యాప్తంగా అనేక సంస్థలున్నా ఇలా ఉద్యోగులను బాగా చూసుకుంటున్న సంస్థలు కొన్నే ఉంటున్నాయి. గతంలో బాలానగర్ లో ఓ సంస్థ తన ఉద్యోగులందరికీ కార్లు కొని పెట్టింది. ఇది మంచి ధోరణే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News