భార్య భర్తల మధ్య సవాలచ్చ యవ్వారాలు ఉంటాయి. అంతా బాగుంటే ఓకే. బాగోలేదు.. ఎవరి దారిన వారు వెళ్లటం ఇప్పుడు ఎక్కువైంది. గతంలో మాదిరి ముక్కు చీదుకుంటూ బతికే రోజులు పోయాయి. అయితే.. బంధాన్ని తెగ కొట్టుకునే విషయంలో హుందాగా కొందరు వ్యవహరిస్తే.. మరికొందరు మాత్రం రచ్చ రచ్చ చేయటం కనిపిస్తుంది. తన సంగతేమో కానీ.. తన నుంచి విడిపోతున్న తన భాగస్వామికి మర్యాద అన్నది లేకుండా చేయాలన్న కోణం చాలామందిలో కనిపిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతం చూస్తే.. ఇలాంటి భావనే కలగటం ఖాయం.
ఆ మధ్యన వచ్చిన ఒక తెలుగు సినిమాలో మాదిరే తాజా ఉదంతం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన ఉమకు నాలుగున్నరేళ్ల కిందట సురేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. మూడు రోజుల క్రితం భార్యతో గొడవ కావటంతో ఆమెను పుట్టింటికి పంపాడు. ఈ క్రమంలో బావమరిదితో గొడవ పడ్డాడు.
కాపురంలో కలతలు కామనే అన్న విషయాన్ని వదిలేసి.. కరపత్రాలు ప్రింట్ చేయించి రచ్చ రచ్చ చేయటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ‘‘ముత్తోజు వెంకట్రాజం.. రాజమణిల కూతురు.. అల్లుడుల విడాకుల పంచాయితీ ఆహ్వానం’’ అంటూ పాంప్లేట్ వేయించి దాన్ని.. వారి ఊళ్లో నలుగురి చేత పంచిపెట్టటం మొదలు పెట్టారు. ఇదేం పని అని అడిగిన వారి నుంచి తప్పించుకున్న అతడి వైఖరిపై ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపురంలో వచ్చే కొట్లాటల గురించి కరపత్రాలు అచ్చేయించి మరీ రచ్చ చేయటంపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.