పెళ్లయిన ఆడాళ్లలో ఆ కోర్కె రెట్టింపు ఉంటుందిట!

Update: 2017-11-04 10:22 GMT
ఇంతకూ ఏ కోరిక? ఏమా కథ? అనుకుంటున్నారు కదా?  మీరు అనుకుంటున్నట్లుగా రసపుష్టి గల కోరికల సంగతి కాదు గానీ.. పెళ్లయిన తర్వాత.. విడాకులు తీసుకోవాలనే కోరిక పురుషులతో పోల్చిచూసినప్పుడు మహిళల్లో రెట్టింపు ఉంటుందిట. అలాగే వివాహ బంధానికి సంబంధించి.. ఆ బంధం మొదలవుతున్నప్పుడు పడే టెన్షన్ కూడా పురుషులకంటె మహిళలకే అధికంగా ఉంటుందిట. మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసే నిపుణులు సుదీర్ఘ కాలం పాటూ జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. కాకపోతే.. ఇది మన దేశీయ మహిళలకు సంబంధించిన మనస్తత్వాన్ని ప్రతిబింబించే అధ్యయనం కాదు. అమెరికాలోని దంపతులకు సంబంధించినది.

అవును. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ కుచెందిన పరిశోధకులు దంపతుల్లో ఉండే ఆందోళనలు, విడాకులు తీసుకోవాలనే కోరిక ల గురించి ఓ పరిశోధన సాగించారు. దాదాపు 355 మంది దంపతులను శాంపిల్స్ గా తీసుకుని.. వారి వివాహం అయిన తర్వాత నాలుగు, తొమ్మిది నెలలకు, రెండు, నాలుగు, ఏడు, 16 సంవత్సరాల తర్వాత.. వారితో మాట్లాడుతూ.. డేటాను నమోదుచేస్తూ వచ్చారు. దంపతుల మధ్య వచ్చే కీచులాటలు, తగాదాలు అలాంటి సందర్భాల్లో వారిలోని ఆందోళనలు, విడాకుల కోసం ఆలోచన రావడం ఇత్యాది అన్ని విషయాల గురించి వారు అధ్యయనం చేశారు. తమ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను డెవలప్ మెంటల్ సైకాలజీ అనే మేగజైన్ లో కూడా ప్రచురించారు.

ఏతావతా తేలినదేంటంటే.. దంపతుల కీచులాటల్లో ఆందోళనలు మాత్రమే కాదు, విడాకులు తీసుకోవాలనే కోరిక కూడా తరచూ ఆడాళ్లకే కలుగుతూ ఉంటుందిట. మగవాళ్లలో ఉండే విడాకుల కోరిక కంటె ఆడాళ్లలో రెట్టింపు ఈ ఉద్దేశం పుడుతూ ఉంటుందని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం అమెరికాకు సంబంధించినదే అయినప్పటికీ.. ఈ మద్య కాలంలో మన దేశంలో కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. నవతరం దంపతుల్లో చాలా మంది.. పెళ్లయిన కొన్నాళ్లకే వివాహ బంధాన్ని తుంచేసుకుంటున్నారు. వీరిని అలాంటి నిర్ణయానికి ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఏంటో మరి!
Tags:    

Similar News