తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సుదీర్ఘకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే విలేకరుల సమావేశం కాకుండా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో వచ్చే శక్తిగా ప్రజలు భావిస్తున్నారని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతం కోసం తాను కూడా సిద్ధమవుతున్నట్లు డీకే అరుణ వెల్లడించారు. వచ్చే జూన్‌లో తాను పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా డీకే అరుణ ప్రకటించారు. ఆలంపూర్ జోగులాంబ జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు నడుస్తానని వెల్లడించారు. డెబ్భై ఏళ్లకు పైబడిన వారిని పార్టీ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పిస్తారనే ప్రచారంపై ఆమె ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ప్రచారంలో ఉందని అయితే, ఇది అమల్లోకి వస్తుందా లేదా అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని డీకే అరుణ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పార్టీపై డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెరట్లో మొక్క కోదండరాం అని డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోదండరాం ఏర్పాటుచేసిన తెలంగాణ జనసమితి ఉద్దేశం కనుక టీఆర్ ఎస్ పార్టీని ఓడించడమే అయితే తమతో కలిసి వస్తుందని నమ్ముతున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.