బతుకమ్మ చీరల వివాదం ఇంకా కొనసాగుతోంది. నాసిరకం చీరల వచ్చాయని పేర్కొంటూ పలువురు మహిళలు వాటిని కాల్చివేసిన ఉదంతంపై టీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనను తెలిపారని చీరలను కాల్చుకునే పరిస్థితి వచ్చిందంటే .. వారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నదో అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. పంపిణీకి ముందే చీరల నాణ్యతను ఎందుకు పరీక్షించలేదని ఆమె ప్రశ్నించారు.
``చేనేత చీరలని .. బతుకమ్మ చీరలని ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేసింది. దానికి విరుద్ధంగా చీరల నాణ్యత ఉండటంతో మహిళలు నిరాశతో నిరసనకు దిగారు. కాంగ్రెస్ ఎక్కడా బతుకమ్మ చీరల పంపిణీని వ్యతిరేకించలేదు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించడం సిగ్గులేని మాటలు. విదేశాల్లో చదువుకొని వచ్చిన కేటీఆర్ .. ఇంత సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదు. ఈ చీరల పంపిణీ మీ పార్టీ కార్యాలయంలో పంచిన చీరలు కాదు. ఇదంతా ప్రజాధనం అందుకే ప్రతిపక్షంగా ప్రశ్నించాం`` అని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు ఎక్కడ బతుకమ్మ చీరల నేతకు అవకాశం ఇవ్వలేదని డీకే అరుణ ఆరోపించారు. కేవలం సిరిసిల్ల లో పవర్ లుమ్ కే చీరలను నేసేందుకు అర్దర్లు ఇచ్చారని తెలిపారు. మహిళల మనోభావాలు తెలుసుకోకుండా కేటీఆర్ మాట్లాడారని ఆమె అన్నారు. చీరల నాణ్యత ఏమిటో మహిళలుగా తమకు తెలుసునని మంత్రి కేటీఆర్ కు ఏం తెలుసని డీకే అరుణ ప్రశ్నించారు.
చీరల పంపిణీలో టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ మహిళలను అవమానించిందని అరుణ ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ``ఇలాంటి నాసిరకం చీరలు నీ కూతురు .. నీ కోడలు కట్టు కుంటారా అని మహిళలు ప్రశ్నిస్తుంటే ..ఆ అక్కసును కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపుతున్నారు. ఎంపీ కవిత ఇలాంటి చీరలు కట్టుకుంటుందా అనేది వారే సమాధానం చెప్పాలి. మన ఇళ్లల్లో పనివారికి కూడా ఇంత నాసిరకం చీరలు ఇవ్వం. ప్రభుత్వ సొమ్ముతో చీరలు పంచుతూ .. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారు? చీరలలో పెద్ద అవినీతి జరిగింది. రూ.222 కోట్లలో ఇప్పుడు పంచుతున్న చీరలను 70 కోట్లకు మించి ఖర్చు కాలేదు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నేతలు తోళ్లు తిన్నారంటే .. తెలంగాణ నేతగా కేసీఆర్ తోలునె కాదు ఎముకలను కూడా మింగుతున్నాడు.`` అని అరుణ మండిపడ్డారు
చీరల పేరుతో ఎన్నికల రాజకీయం చేయాలని చూసిన కేసీఆర్ జిమ్మిక్కు బెడిసి కొట్టిందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ అధికార మదంతో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఇలాంటి విమర్శలు మాకుకోకపోతే ఖబర్దార్ అని హెచ్చరించారు. నాసిరకం చీరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీరలకోసం మహిళలకు నేరుగా వారి బ్యాంకుల్లో డబ్బులు వేయాలని కోరారు. చీరలు కాల్చిన మహిళలపై కేసులు పెట్టడం దుర్మార్గమని అరుణ మండిపడ్డారు. నేరేళ్ల ఘటనలో దళితులపై దాడిచేసిన వారిపై కేసులు లేవని...భూపాలపల్లిలో గిరిజనులపై దాడిచేసిన వారిపై కేసులు లేవని కానీ మహిళలపై కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ఓటు వేయమంటే కూడా కేసులు పెడతారేమేనని ఆమె ఎద్దేవా చేశారు.