ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆమె మాటలు తూటాల్లా పేలుతుంటాయి. తన మాటలతో వివాదాల కంటే కూడా..ప్రత్యర్థుల్ని ఇరుకునే తత్వం ఆమె సొంతం. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత.. ఎవరినైనా సరే తన నోటి మాటతో తూర్పార పట్టే దమ్మున్న డీకే అరుణగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. మొనగాళ్లు లాంటి పొలిటీషియన్స్ పెదవి విప్పని వేళ.. ఆయన తీరును ఏకిపారేసిన అతి కొద్దిమందిలో డీకే అరుణ ఒకరిని చెప్పాలి.
తమ తీరుతో ప్రత్యర్థుల నోట మాట రాకుండే చేసే తెలంగాణ అధికారపక్ష నేతలు.. అసెంబ్లీ సమావేశాల్లో డీకే అరుణ మాటల దాడిని ఎదుర్కొనటానికి ప్రత్యేక వ్యూహ రచన చేసేలా ఆమె వ్యవహరిస్తుంటారు. మాటలతో ఇంతగా చెలరేగిపోయే ఆమె.. తాజాగా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో మోడీ మాట తీరులో శాడిజం కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి.. ఇప్పుడు నెలల తరబడి సమయం కావాలనటాన్ని ఆమె తప్పు పట్టారు.
రద్దు నిర్ణయం తీసుకొని పది రోజులు కావొస్తున్నా ఇప్పటివరకూ పరిష్కారం లభించలేదని.. సామాన్యుల కష్టాలు తీరలేదన్న అరుణ.. రద్దు నిర్ణయం సామాన్యుల మీద సర్జికల్ దాడిగా అభివర్ణించారు. దేశాన్ని పక్కదారి పట్టించేందుకే మోడీ రద్దులాంటి ప్రకటనలు చేస్తుంటారన్నారు. ఎన్నికల వేళ.. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చివంద రోజుల్లో ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని మాట ఇచ్చారని.. రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.
బీజేపీ.. దాని మిత్రపక్షాలు.. మోడీ సర్కారుతో సఖ్యతగా ఉండే రాష్ట్రాధినేతలకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం ముందే తెలుసని ఆరోపించిన డీకే అరుణ.. తమకు అందిన సమాచారంతో ముందుగా సర్దుకున్నారన్నారు. చరిత్రలో నిలిచిపోవాలన్న దురాశతోనే మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని.. ప్రజల మీద తమ నిర్ణయాన్ని రుద్దారని ఆరోపించారు. ప్రధాని మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరపనున్న మంతనాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరున్న బ్లాక్ ను వైట్ గా మార్చుకునేందుకే ప్రధానితో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారన్నారు. జీతాలు చెల్లించలేమని కేసీఆర్ లీకులు ఇస్తున్నారని.. ధనికరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందని ఆమె నిలదీస్తున్నారు. నిజమే.. ధనిక రాష్ట్రంలో ఎప్పుడూ నిధుల కొరతేంటి చెప్మా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/