నా కొడ‌క‌ల్లారా..అంటూ గులాబీ బ్యాచ్ పై గుస్సా

Update: 2018-10-05 04:15 GMT
నువ్వు ఒక‌టి అంటే నేను రెండు అంటా. నీకు మాత్ర‌మే తిట్లు వ‌చ్చా?  నీ కంటే ప‌ది ఆకులు ఎక్కువ చ‌దివినోళ్లు చాలామందే ఉన్నారు.. మ‌ర్యాద మిస్ అయితే.. నీ భాష‌లోనే స‌మాధాన‌మిస్తా అన్న‌ట్లుగా తెలంగాణ సీనియ‌ర్ మ‌హిళా నేత‌.. మాజీ మంత్రి డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మామూలుగానే ఫైర బ్రాండ్ అయిన డీకే అరుణ‌.. తాజాగా గులాబీ బ్యాచ్ పై గుస్సా అయ్యారు. థూ.. మీ బ‌తుకులు చెడ అంటూ కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ధీటుగా తాము మాట్లాడ‌గ‌ల‌మ‌న్న విష‌యాన్ని చెప్పానుకున్నారో ఏమో కానీ డీకే అరుణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తిట్లే కావాలంటే తాము కూడా దిగ‌జారి మాట్లాడేందుకు ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌ద‌న్న సంకేతాన్ని త‌న వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌ద్వాల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ప‌దేళ్లు కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌శాంతంగా ఉన్న పల్లెల్లో ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టించి రాజ‌కీ్యంగా ల‌బ్థి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్న టీఆర్ఎస్ నేత‌ల తాట తీస్తాన‌ని ఆమె హెచ్చ‌రించారు.

రాజ‌కీయం ముసుగులో రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునేది లేద‌న్న ఆమె ఊహించ‌ని రీతిలో ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌బ‌డ్డార్ .. నా కొడ‌క‌ల్లారా.. అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రానున్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని.. అరాచ‌కాల‌కు పాల్ప‌డే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామ‌న్నారు. కేసీఆర్ మాట‌ల్లో నిజ‌మ‌న్న‌దే లేద‌ని.. ఆయ‌న చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ‌కు మొద‌టి ముఖ్య‌మంత్రి ద‌ళితుడ్ని చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ మాట మొద‌లుకొని ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌దాన్ని నిల‌బెట్టుకోలేద‌న్నారు. ఎన్నిక‌ల పేరుతో మ‌రోసారి ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తిట్ల విష‌యంలో కేసీఆర్ ముందుంటే.. ఆ కొర‌త‌ను తీర్చేలా.. అంత‌కు మించి అన్న త‌ర‌హాలో డీకే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో నేత‌ల నోట మాట‌లు రాయ‌లేని స్థితికి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదేమో?
Tags:    

Similar News