తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీలోకి ఇతర పార్టీల నేతలు చేరవడం వల్ల బలపడుతుందని అంతా భావిస్తుంటే...ఆ చేరికలు కాస్త నాయకుల మధ్య చీలికలకు కారణంగా మారాయని అంటున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. నాగంను ఆహ్వానిస్తున్న నేతలు కొందరైతే, మరికొందరు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఆ పార్టీలోని విభేదాలు రచ్చకు ఎక్కిస్తున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంలో ఏం జరుగుతుంతో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
గాంధీ భవన్ లోజరుగుతున్న పరిణామాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీ రెండు శిబిరాలుగా చీలిపోయింది. సీనియర్ నేత నాగం రాకపై ఎవరికి వారే బహిరంగ ప్రకటనలు చేస్తూ ఆ పార్టీలో వేడిపుట్టిస్తున్నారు. నాగంను వ్యతిరేకిస్తున్న గ్రూపులు - ఆహ్వానిస్తున్న గ్రూపు ఎవరో తేలిపోయింది. నాగం రాకపై డికె అరుణ - జైపాల్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరొ కరు ఎలాగైనా పార్టీలోకి తెచ్చి నాగర్ కర్నూల్ లో గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే అరుణ నాగం వ్యతిరేక టీంలో క్రియాశీలంగా ఉన్నారు. జైపాల్ రెడ్డి ప్రోత్సహంతోనే ఉత్తమ్ నాగంను ఢిల్లీకి తీసుకెళ్లారని డికె అరుణ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలను పట్టించుకో కుండా ఉత్తమ్ ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని వారంటున్నారు. ఇప్పటికే ఆమె వర్గీయులు ఎంపీ నంది ఎల్లయ్య - ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నాగంను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగంను ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీని కల్పించినట్టు ప్రచారం జరిగింది.
మరోవైపు ఎమ్మెల్సీ దామోదరరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి - నాగంపై విమర్శలు కుప్పించారు. ఆయనను పార్టీలోకి తీసుకొస్తే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా జైపాల్ రెడ్డి క్రిమినల్ రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. డీకే అరుణను లక్ష్యంగా చేసుకుని జైపాల్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని పునరుద్ధాటించారు. దామోదర్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో తీవ్రమైన దుమారం రేగింది. పార్టీలోకి కొత్త వారేవరైనా ఆహ్వానిస్తామని జైపాల్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి - చల్లా వంశీచంద్ రెడ్డి మీడియాకు చెప్పారు. జిల్లాలో నాగం జనార్థనరెడ్డి బలమైన నేత అన్నారు. బలమైన నాయకులెవరు వచ్చిన ఆహ్వానిస్తామన్నారు. నాగం - జైపాల్ రెడ్డిలపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందడానికి నాగం కృషి చేసిన విషయాన్ని మార్చిపోవద్దని వారు పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నా సీటు త్యాగం చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి చెప్పారు. రావుల దేవరకద్ర నియోజకవర్గంలో పోటీ చేస్తామంటే సంతోషమన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన పవన్ కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన నేత అన్నారు. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే కాంగ్రెస్ లో పుట్టిన పెరిగిన నేతలెవరు వ్యతిరేకించడం లేదన్నారు. ఇతర పార్టీలు మారిన కాంగ్రెస్‌లో ఉన్న వారే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. స్థూలంగా పార్టీలోకి నాగం రాకముందే...ఆయన అనుకూల వర్గం ఎవరో వ్యతిరేకం ఎవరో తేలిపోయిందని అంటున్నారు.