మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లపై అలిగారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో తన సోదరుడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అస్సలు పట్టించుకోలేదని ఆమె ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆమె మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి కూడా కావాలనే గైర్హాజరైనట్టు తెలుస్తోంది.
డీకే అరుణ కోపం ఎలా ఉన్నా వి.హనుమంతరావు లాంటి సీనియర్లు మినహా తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకులైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పెద్దగా స్పందించలేదనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక డీకే అరుణ జిల్లా నాయకులను సమీకరించి ఈ సంఘటనను నిరసిస్తూ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. చిట్టెం సంఘటనపై పార్టీలో సీనియర్ నాయకులు ఎవ్వరు సరిగా స్పందించలేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై పార్టీ నాయకులు అధికార పక్షాన్ని నిలదీస్తారో లేదో చూస్తానని..లేని పక్షంలో తాను పార్టీనేతల వైఖరిపై అధిష్టానం వద్దే తేల్చుకుంటానని హెచ్చరికగా చెప్పినట్టు సమాచారం. పార్టీ నాయకులపై అసంతృఫ్తితో రగిలిపోతున్న అరుణ, చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు వనపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా ఈ సమావేశానికి కావాలనే డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. అరుణ హెచ్చరికలు కాంగ్రెస్ సీనియర్ నాయకుల చెవిన పడితే వారు అధికార పార్టీని నీలదీస్తారా లేదా ఆమె హెచ్చరించినట్టుగానే ఈ విషయంపై అధిష్టానం వద్ద పంచాయతీ పెడుతుందా అన్నది చూడాలి.