మహబూబనగర్ జిల్లాలోని గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా సాధన పేరిట ఇటీవల ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా ఆమె గద్వాల బంద్ కు పిలుపునిచ్చారు. గద్వాలలో బంద్ కొనసాగుతున్న సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గద్వాల జిల్లా సాధన కోసం టీఆర్ ఎస్ తమతో పాటు కదలిరావాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధన కోసం టీఆర్ఎస్ నేతలు ముందుకు వస్తే, వారి వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. లేనిపక్షంలో గద్వాల నుంచి ఆ పార్టీని తరిమికొడతామని ఆమె హెచ్చరించారు.
మరోవైపు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది. జిల్లాలతో పాటు, మండలాలు, రెవెన్యూ డివిజన్లపై పునర్విభజనపై నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది. అయితే జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ సర్కారు తన నాయకులకు అనుగుణంగా ఉన్న స్థానాలనే జిల్లా కేంద్రాలుగా చేయాలని ఆలోచన చేస్తోందని మండిపడుతున్నాయి. జిల్లా కేంద్రాల ప్రకటనల్లో రియల్ మాఫియాకు సహకరించే ఉద్దేశం కూడా ఉందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో డైనమిక్ లీడర్ గా పేరున్న డీకే అరుణ ముందుగా గళం విప్పారు.