అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ వచ్చాక చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది. అన్నింటికి మించి.. సెల్ ఫోన్ కాస్తా స్మార్ట్ ఫోన్ గా రూపాంతరం చెందిన నాటి నుంచి పరిస్థితులు మరింత వేగంగా మారాయి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ సెల్ఫీల కోసం ప్రయత్నించటం.. సెల్ఫీలు జీవితంలో ఒక భాగంగా మారాయి.
ఎక్కడికైనా వెళ్లినప్పుడు సెలబ్రిటీలు కానీ.. ప్రముఖులు కానీ కనిపిస్తే వారి చుట్టూ చేరి.. సెల్ఫీల కోసం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తాజాగా అలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఒక యువకుడికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీసుకున్న క్లాస్ విస్మయానికి గురి చేస్తోంది.
మాండ్యలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన డీకే శివకుమార్ తో కలిసి సెల్ఫీ దిగేందుకు ఒక యువకుడు ప్రయత్నిస్తే.. ఊహించని రీతిలో ఆయన రియాక్టు అయి అందరికి షాకిచ్చారు. రాజీవ్ గాంధీకి ఏమైందో తెలుసా? అంటూ పక్కకు నెట్టేశారు. దీంతో.. సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహపడిన సదరు యువకుడు విస్తుపోయాడు. డీకే వెనుక నుంచి వచ్చిన సదరు కుర్రాడు.. తన మొబైల్ లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్బంగా సదరు యువకుడ్ని అడ్డుకున్న డీకే శివకుమార్.. అతని చేతిని పట్టుకొని.. ‘ఎవరి చేతిలో ఏముందో మనకు తెలియదు. రాజీవ్ గాంధీ విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసా? కొన్ని సందర్భాల్లో మనుషుల్లో ఉండే ఆగ్రహం.. భావోద్వేగాలు బయటకు వస్తుంటాయి.
వాటిని తప్పనలేమంటూ పీకిన క్లాస్ తో ఎలా స్పందించాలో అర్థం కాక మిన్నకుండిపోయాడు సదరు కార్యకర్త. అప్పుడెప్పుడో జరిగిన రాజీవ్ హత్య ఉదంతాన్ని.. సంబంధం లేని అంశంలోకి డీకే తీసుకొచ్చారన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి క్లాసులు పార్టీకి మేలు కంటే కీడే చేస్తాయన్న విషయాన్ని డీకే ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.