డీఎల్‌ కు అస‌హ్యంగా అనిపించిందట‌

Update: 2015-11-06 09:32 GMT
రాష్ట్రాన్ని నిట్ట‌నిలువునా చీల్చేసిన‌ప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌కు చీమ కుట్టిన‌ట్లుగా అనిపించ‌లేదు. చాలామంది నోరు విప్ప‌కుండా ఉండిపోయారు. మాట‌లు రాని మూగ‌వాళ్లుగా మారిపోయారు. కోట్లాది మంది సీమాంధ్రుల భ‌విష్య‌త్తుల్ని పార్టీ అధినేత్రి స‌మాధి చేస్తున్నా ప‌ల్లెత్తు మాట్లాడింది లేదు. ఏపీ ప్ర‌యోజ‌నం కోసం గ‌ళం విప్పింది లేదు. ఒక‌ట్రెండు మాట‌లు అన్న వారిని అధిష్ఠానం లైట్ తీసుకుంది. తాము అంత పెద్ద దెబ్బ కొ్ట్టిన‌ప్పుడు ఆ మాత్రం మాట్లాడ‌రా అని ఊరుకుండిపోయింది.

ఇలా సోనియా ప‌రివారం అంతా క‌లిసి సీమాంధ్రుల్ని ఏ స్థాయిలో దెబ్బ కొట్టారో అంద‌రికి తెలిసిందే. అలాంటి స‌మ‌యంలోనూ నోరు విప్ప‌ని చాలామంది ఇప్పుడు అరిచి గీపెట్టేస్తున్నారు. ఏపీకి ఏదో జ‌రిగిపోయిందంటూ కిందామీదా ప‌డి గుండెలు బాదుకుంటున్నారు. ఎవ‌రిదాకానో ఎందుకు క‌డ‌ప జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి వ్య‌వ‌హార‌మే చూడండి. విభ‌జ‌న స‌మ‌యంలో నాలుగైదు సినిమాటిక్ డైలాగులు చెప్పేసి.. గ‌మ్మున ఉండిపోయిన ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ గ‌ళం విప్ప‌టం మొద‌లు పెట్టారు.

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం ఆయ‌న‌కు అస‌హ్యంగా అనిపించింద‌ట‌. అన‌వ‌స‌రంగా వంద‌లాది కోట్లు ఖ‌ర్చు చేశార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి మీద రాయ‌ల‌సీమ వాసుల‌కే కాదు.. ఉత్త‌రాంధ్ర‌వారికి కూడా అసంతృప్తి ఉందంటూ కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. తాను కాంగ్రెస్ ను విడిచి పెట్ట‌న‌ని చెప్పిన ఆయ‌న‌.. రాజ‌ధాని విష‌యంపై వేద‌న‌ను వ్య‌క్తం చేశారు. డీఎల్ అస‌హ్య‌పు మాట‌లు చూస్తుంటే.. విభ‌జ‌న త‌ర్వాత కూడా ఈ కాంగ్రెస్ నాయ‌కుడికి అంత‌ర్లీనంగా మ‌రేదో కోరిక ఉన్న‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.

రాయ‌ల‌సీమ‌.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కుఅమ‌రావ‌తి విష‌యంలో అసంతృప్తి ఉందంటూ కొత్త విద్వేషానికి తెర తీస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఇప్ప‌టికే ఏపీని ముక్క‌లు చేసిన డీఎల్ లాంటి కాంగ్రెస్ వాదుల‌కు.. ఏపీని ఇంకెన్ని ముక్క‌లు చేయాలో అన్నట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News