తమిళనాడు ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్ర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల నామినేషన్లు దాఖలు సందర్భంగా ఆస్తుల ప్రకటన తప్పనిసరి కావడంతో నాయకులు సమర్పించిన ఆస్తులు, అప్పుల చిట్టా ఆసక్తికరంగానే కాదు, వింతగా కూడా ఉంది.
డీఎంకే అధినేత - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అయితే ఏకంగా తనకున్న ఆస్తి ఇద్దరు భార్యలు దయాళు అమ్మాళ్ - రాజాత్తి అమ్మాళ్ లు మాత్రమేనని తేల్చిచెప్పారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న కరుణ నిధి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించగా అందులోతనకు స్థిరాస్తులు - వ్యవసాయ భూములు లేవని ఆయన స్పష్టం చేశారు.
తనకేమీ ఆస్తిపాస్తులు లేవని చెప్తూనే...తన ఇద్దరు భార్యల ఆస్తుల విలువ రూ.62.99 కోట్లని చెప్పారు. రెండో భార్య రాజాత్తి అమ్మాళ్ కు రూ.11.94 కోట్ల అప్పున్నట్లు వివరించారు. 92 ఏళ్ల వయసులో కరుణానిధి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. డీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది.