కలియుగ ప్రత్యక్ష దైవం..కోట్లాది మంది ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలుగువారనే కాకుండా....భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే ఏడుకొండల వాడి విషయంలో డీఎంకే ఎంపీ రచ్చ చేసే కామెంట్లు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె తీరుపై ఇటు సోషల్ మీడియాలో అటు పార్టీల పరంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
వివిధ ప్రసార మాధ్యమాల ప్రకారం `పేదవాడిని కాపాడలేని ఒక దేవుడిగా అలాంటి దేవుడు మనకి ఎందుకు?..అవసరం లేదు` అని తమిళ రాజకీయాల్లో ప్రధాన పార్టీ అయిన డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళి వ్యాఖ్యానించారు. `దేవుడి ముందు అంతా సమానమే అని నీతులు చెబుతుంటారని అయితే ఈ దేవుడు వాస్తవానికి డబ్బున్నవారే దేవుడి వద్దకు ప్రత్యేక దర్శనం ద్వారా వెలుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ప్రతీ రోజు గంటలు గంటలు పడిగాపులు కాసి చూడవలసి వస్తోంది. కోట్లాది రూపాయలు ఇచ్చే కోటీశ్వరులకే ఆయన దేవుడు` అని కనిమొళి అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తన సొంత హుండీని కాపాడుకోలేని దేవుడు మనల్ని ఏమి కాపాడుతాడు అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కాగా, ఎంతో భక్తి విశ్వాసాలతో కొలుచుకునే కొంగు బంగారమైన వేంకటేశ్వర స్వామిపై తమిళ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు హిందువుల మనోభావాలని దెబ్బ తీసింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు అటు తమిళ ఇటు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి తీవ్ర ఆగ్రహావేశాలు కల్గిస్తున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమె తీరును తీవ్రంగా ఖండించారు. `దేవుళ్ళని విమర్శిస్తున్నావు కనుకనే అరెస్టులు అయ్యి పరువు పోయింది` అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. `నువ్వు 2జీ స్పెక్ట్రం స్కాములో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఇదే దేవుడికి మొక్కుకున్నారు` అని గుర్తుచేశారు.