తమిళనాడులో రాజకీయాలు ముదురుపాకాన పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రతిపక్ష ద్రావిడ మున్నేట్ర కజగం ముఖ్య నేత స్టాలిన్ అనుమానాలు వ్యక్తం చేశారు. 75 రోజుల పాటు మృత్యువుతో పోరాటం మరణించిన క్రమంలో జయలలితకు అందిన చికిత్స పైన శ్వేతపత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. సీఎంకు ఎలాంటి చికిత్స చేశారన్న దాని పైన అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల తరఫు నుంచి వస్తున్న సందేహాలను తాము ప్రస్తావిస్తున్నామని స్టాలిన్ అన్నారు.
ఇదిలాఉండగా ఇప్పటికే నటి గౌతమి సీఎం జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జయలిలత మేనకోడలు దీపా సైతం ఈ విషయంలో తన సందేహాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో స్టాలిన్ డిమాండ్ ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/