లోపల యుద్ధం చేసి..బయటకు కూల్ గా వచ్చారు

Update: 2017-02-18 08:47 GMT
తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ ఒక్క ఘటన మరో ఎత్తుగా చెప్పాలి. ఎవరైనాతీవ్రఆవేశంతో ఉన్నప్పుడు.. దాని నుంచి కూల్ కావటానికి కాస్తసమయం తీసుకుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా క్షణాల వ్యవధిలో తమ వైఖరిని మార్చేసిన వైనం విస్మయానికి గురి చేసే పరిస్థితి. పళనిస్వామి ప్రభుత్వం తన బలనిరూపణ కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలిసిందే.

మొదట్లో అసెంబ్లీ కార్యక్రమాల్ని లైవ్ టెలికాస్ట్ పై ఆంక్షలు విధించారు. దీంతో..సభలోపల జరిగిన రచ్చ ఏ స్థాయిలో అన్నది తెలియలేదు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత అంతకు ముందు రచ్చకు సంబంధించిన దృశ్యాలతో పాటు..  సభను లైవ్ టెలికాస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. సభలో డీఎంకే సభ్యులు ఎంత రచ్చ చేశారన్నది అర్థమయ్యే పరిస్థితి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలిసారి సభ వాయిదా పడటానికి ముందు సభలో యుద్ధం చేసిన డీఎంకే సభ్యులు.. సభ వాయిదా పడిన తర్వాత మాత్రం బయటకు కామ్ గా రావటం.. కూల్ గా ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకోవటం మీడియా వర్గాలకు కనిపించింది. ప్రశాంతంగా వచ్చిన డీఎంకే నేతల వైఖరితో.. బయట ఉన్న మీడియాకు.. పోలీసులకు కాస్త కన్ప్యూజన్ చోటు చేసుకుంది. అయితే.. సభలో జరిగిన రచ్చవిజువల్స్ బయటకు వచ్చాక కానీ.. డీఎంకే ఎమ్మెల్యేలు ఎంత గొప్ప నటులో బయటప్రపంచానికి తెలిసిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News