ప్రస్తుతం ఇండియా లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుండి ఎవరైనా భారత్ కి వెళ్లాలని అనుకునే వారు తమ ప్రయాణాలు రద్దు లేదా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్ కు వెళ్లకపోవడమే ఉత్తమం అని , అయితే కేవలం తప్పని పరిస్థితులో వెళ్లాల్సి వస్తే మాత్రం రెండు డోసుల టీకా వేయించుకున్నాకే అన్ని జాగ్రత్తలు తీసుకోని, భారత్ కు వెళ్లాలని అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది.
అలాగే, ఇండియాను నాలుగో కేటగిరీలో చేర్చింది అమెరికా ఆరోగ్యశాఖ. దేశంలో కరోనా అత్యంత తీవ్రంగా భారత్‌లో ఉందని చెబుతూ ఈ లెవెల్ 4 కేటగిరీ సూచిస్తుంది. ఈ మేరకు కొన్ని గైడ్ లైన్స్ ను సైతం విడుదల చేసింది. భారత్ లో ప్రస్తుతం కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిందని అమెరికా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్న వేళ ఇప్పటికే ఢిల్లీ , మహారాష్ట్ర , తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించారు. ఇదిలా ఉంటే ఓవైపు కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తుంటే మరోవైపు ఆక్సిజన్ కొరత కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు హాస్పిటల్స్‌లో బెడ్లు లేక పేషెంట్లు ఇబ్బంది పడటమే కాకుండా రెమిడెసివీర్‌లాంటి డ్రగ్స్ కూడా దొరక్క ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే వ్యాక్సిన్ కొరత కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో భారత్ కు వెళ్లాలని భావిస్తే కరోనా టీకాలు రెండు డోసులు వేసుకుని వెళ్లాలని అమెరికా ప్రయాణికులకు ఆ దేశ ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, గుంపుల్లో ఉండకూడదని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాలంటూ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇకపోతే ,దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొత్తగా 2,59,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 1,54,761 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 1,761 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,80,530కు పెరిగింది.