చేతులెత్తేసిన జగ్గారెడ్డి !

Update: 2018-12-13 05:58 GMT
జగ్గారెడ్డి ఎప్పుడూ పెద్ద గడ్డం.. జులపాల జుత్తుతో నెత్తిన రూపాయ్ బిల్లంత బొట్టుతో కార్యకర్తలను వెంటబెట్టుకుని హల్‌ చల్ చేసే కాంగ్రెస్ నాయకుడు. కొత్తకోట ఈయన ఇంటిపేరే అయిన వివాదాలే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్న నాయకుడు. వైఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. తెలంగాణలో తాజాగా జరిగిన ముందుస్తు ఎన్నికలలో హేమాహేమీలైన కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి.. డీకే అరుణ - సంపత్ కుమార్ ఓటమి పాల‌య్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంలో వారంతా కొట్టుకుపోయారు. అయితే జగ్గారెడ్డి మాత్రం అనూహ్యంగా విజయం సాధించారు. అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. ఇప్పటికే మానవ అక్రమ రవాణ కేసులో పీకల లోతు కూరుకున్న జగ్గారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో అనే భయం నీడలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో జగ్గరెడ్డి తన పాత పల్లవిని మార్చుకున్నారు.

వచ్చే నాలుగు సంవత్సారాలు తన నియోజకవర్గ అభివృద్ది గురించి తప్ప ప్రభుత్వం గురించి కాని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురించి కాని పల్లెత్తు మాట అననని బ‌హిరంగంగా ప్రకటించారు. తన నియోజకవర్గం ముఖ్యమంత్రి ఎన్నికైన జిల్లాలోనే ఉందని - ఆ నియోజకవర్గ అభివృద్దికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుంటానని ప్రకటించారు. ప్రభుత్వంతో వైరం పెట్టుకుంటే తన నియోజకవర్గం అభివృద్ది చెందదని - దీనిని అనుసరించి తాను ఎటువంటి విమర్శలు - ఆరోపణలు చేయనంటూ జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో జగ్గారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం ముందు చేతులెత్తేసినట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

తనపై ఉన్న మానవ అక్రమ రవాణ కేసుతో ప్రభుత్వం ఏమైన చేయవచ్చుననే భయం జగ్గారెడ్డిని వెంటాడుతోందని కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మొత్తానికి తెలంగాణ కొత్త శాసన సభలో పెదవి విప్పేందుకు కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ముందుకు వచ్చే పరిస్దిిితి లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి స్దాయి నాయకులే ఓడిపోతే తనలాంటి చిన్న నాయకులకు దిక్కేమిటని జగ్గారెడ్డి వాపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని - తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రసన్నం చేసుకుని కేసుల నుంచి వివాదాల నుంచి దూరంగా ఉంటే మేలని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Tags:    

Similar News