చంద్రబాబు దొంగ.. ఓటు వేయొద్దు:పోసాని

Update: 2019-03-18 10:14 GMT
చంద్రబాబు ఒక దొంగ అని.. చంద్రబాబుకు మరో ఓటేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుందని నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన విమర్శలు చేశారు. బాబు మళ్లీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కమ్మ రాజ్యం మాత్రమే నడుస్తుందని వివర్శించారు. తాను తీసిన ‘అనగనగా ఒక ముఖ్యమంత్రి’ సినిమాను విడుదల కాకుండా ఎన్నికల సంఘం అడ్డుకోవడాన్ని పోసాని తీవ్రంగా ఖండించారు. ఎవరో లేఖ రాస్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తన సినిమాలో ఏముందో కూడా తెలియకుండా ఎలా అడ్డుకుంటారని ఈసీని పోసాని ప్రశ్నించారు.

చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. సినిమాలో అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డు స్పందిస్తుంది కానీ.. ఎన్నికల సంఘానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

తన సినిమాకు ‘అనగనగా ఒక ముఖ్యమంత్రి’ అని టైటిల్ పెట్టగానే అది చంద్రబాబు గురించే అనుకుంటే ఎలా అని పోసాని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు నిబంధనలకు లోబడే తీస్తామని స్పష్టం చేశారు. టీవీ చానళ్లలో ఇష్టానుసారం మాట్లాడితే ప్రభావం కానీ ఓటర్లు కేవలం సినిమా చూసి ప్రభావం అవుతారా అని పోసాని ప్రశ్నించారు.  మంచి పనులు చేస్తే నాయకులు సినిమాలకు ఎందుకు భయపడుతారని నిలదీశారు.

లంగా పనులు చేసే వారే తన సినిమాను అడ్డుకుంటున్నారని పోసాని ఫైర్ అయ్యారు. సినిమాల దెబ్బకు ఓడిపోయేంత బలహీనంగా రాజకీయ పార్టీలు ఉన్నాయా అని పోసాని నిలదీశారు. తన సినిమాను ఈసీ ఆపితే కోర్టుకు వెళతానని.. రోజూ టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతానని పోసాని హెచ్చరించారు. ఈసీ నన్ను ఆపుతుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఏం చేసినా అడ్డుకునే వ్యవస్థ  పైన లేదా అని పోసాని ప్రశ్నించారు. 15 ఏళ్లు పెళ్లాన్ని రోజూ కొట్టి.. ఆ తర్వాత పెళ్లాం దేవత అంటే ఎలా ఉంటుందో చంద్రబాబు తీరు అలాగే ఉందని మండిపడ్డారు. దళితులంటే లెక్కలేని బాబు వ్యాఖ్యలు ఎవ్వరూ ఖండించలేదన్నారు. బాబు ఒక పెద్ద దొంగ అని పోసాని మండిపడ్డారు.


Tags:    

Similar News