ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో అకౌంట్ లేనోడే కనిపించరు. ఆ మాటకు వస్తే.. కొందరికి రెండు.. మూడు అకౌంట్లు కూడా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. సోషల్ మీడియాను అసరా చేసుకొని దరిద్రపుగొట్టుపనులు చేస్తూ.. కోట్లాది రూపాయిలు కొల్లగొట్టే దుర్మార్గులు కొందరు ఉన్నారు. వీరు చేసే చేష్టల గురించి తెలిస్తే నోట మాట రాదు కదా? ఇలా కూడా చేస్తారా? అన్న విస్మయానికి గురవుతారు. ఇన్ స్టాలో అకౌంట్ ఉన్న వారు ఈస్టోరీని తప్పనిసరిగా చదవాలి. దాదాపు వెయ్యి మంది అమ్మాయిల్ని ఒక మోసగాడు ట్రాప్ చేయటమే కాదు.. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు కొట్టేసిన వైనం తెలిస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఇతగాడి చేష్టలు ఎలా ఉన్నాయన్న దానిపై సైబరాబాద్ కు చెందిన పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఈ తరహా సైబర్ నేరం దేశంలోనే ఇదే మొదటిది కావచ్చన్న మాట వినిపిస్తోంది. ఇతగాడి చావుతెలివిని చూసి అవాక్కు అవుతున్నారు. ఇంతకీ ఇతడు ఎక్కడి వాడు? ఏం చదివాడు? ఏం చేస్తుండేవాడు? ఈ నేరాల్లోకి ఎందుకు దిగాడు? ఎంత తెలివిగా ట్రాప్ చేసే వాడు? లాంటి విషయాల్లోకి వెళితే..
రాజమండ్రికి చెందిన వంశీ క్రిష్ణ 2014లో బీటెక్ పూర్తి చేశాడు. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి కూకట్ పల్లిలో ఉండేవాడు. సరైన ఉద్యోగం దొరక్క ట్రావెల్ కంపెనీలో పని చేసేవాడు. ఇతడికి గుర్రపు పందాలు.. క్రికెట్ బెట్టింగ్ లు అంటే మోజూ. ఆ వ్యసనంలోకి చిక్కకుపోయాడు. ఇందుకు సరపడా డబ్బులు లేకపోవటంతో ఎలా అయినా సరే అడ్డదారిలో సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. దీంతో.. వారిచ్చిన ఫిర్యాదుతో అరెస్టు అయి.. జైలుకు వెళ్లి వచ్చాడు. అది అతడిలో మరింత మార్పునకు కారణమై.. సైబర్ నేరస్తుడిగా మార్చింది.
ఇన్ స్టా వేదికగా చేసుకొని సంపన్నులైన అమ్మాయిల్ని ఎర వేసేవాడు. డబ్బున్న అమ్మాయిల్ని గుర్తించేందుకు వీలుగా మ్యాట్రిమోనియల్ సైట్లలో అమ్మాయిల జాబితాను చెక్ చేసేవాడు. వాటి ఆధారంగా వారి పేరు మీద ఉన్న ఇన్ స్టా అకౌంట్లను గుర్తించేవాడు. హర్షవర్ధన్ అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి.. వేర్వేరు అమ్మాయిల పేర్లతో దొంగ అకౌంట్లను వందవరకు క్రియేట్ చేశాడు.
అమ్మాయి పేరుతో తెరిచిన అకౌంట్లతో తాను టార్గెట్ చేయాలనుకున్నఅమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపేవాడు. రిక్వెస్టు చేసింది అమ్మాయే కదా? అన్న ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఆ తర్వాత నెమ్మదిగా హర్షవర్దన్ పేరును సీన్లోకి తెచ్చేవాడు. తనకు హర్షవర్దన్ అనే స్నేహితుడు ఉన్నాడని.. అతడు బోలెడన్ని సేవా కార్యక్రమాల్ని చేస్తుంటాడని.. బిలియనీర్ గా బిల్డప్ ఇచమచేవాడు. హర్షవర్ధన్ మీద ఆసక్తి వ్యక్తమయ్యేలా చేసేవాడు. తర్వాత హర్షవర్దన్ పేరుతో ఫాలో అయ్యేవాడు. వారితో స్నేహం నటించినట్లే నటిస్తూ.. వారు కోరుకోకుండానే లక్ష.. రూ.2లక్షల మొత్తాన్ని వారికి పంపేవాడు.. సరదాగా ఖర్చు చేసుకోవాలనేవాడు.
దీంతో.. అతని మీద నమ్మకం ఏర్పడేది. కాస్త టైం తీసుకొని అసలు ప్లాన్ అమలు చేసేవాడు. తనకు అనుకోకుండా బ్యాంకు ఖాతా స్తంభించిందని.. వెంటనే డబ్బు అవసరమవుతుందని చెప్పి.. రూ.5లక్షలు కానీ రూ.10లక్షలు కానీ అడిగేవాడు. తమకు ఏ సంబంధం లేకుండా లక్ష.. రెండు లక్షలు ఖర్చు కోసం ఇచ్చే స్నేహితుడి కోసమని వారు అతడు కోరిన డబ్బులు ఇచ్చేవారు. ఆ తర్వాత పత్తాలేకుండాపోయేవాడు. ఈ తరహాలో ఇప్పటివరకు అతను వెయ్యి మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసినట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతని మీద యాభై వరకు కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా వచ్చిన కంప్లైంట్ తో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు.. అతడ్ని పట్టుకొని విచారిస్తే.. ఈ కళ్లు చెదిరే నేరాన్ని చెప్పుకొచ్చాడు.
ఇక.. అమ్మాయిల వద్ద ఎంత మొత్తాన్ని కొట్టేసి ఉంటాడన్న ప్రశ్నకు పోలీసులు సమాధానం ఇస్తూ.. ప్రాథమికంగా రూ.2.5కోట్ల వరకు ఉందని.. ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. మరి.. ఇన్ని డబ్బుల్ని ఏం చేశాడన్న విషయానికి వస్తే.. బ్రేక్ ఫాస్ట్ బెంగళూరులో చేస్తే.. డిన్నర్ ఢిల్లీలో చేసేవాడు. క్రికెట్ బెట్టింగులు.. గుర్రపు పందాలకు పెట్టేవాడు. సో.. ఇన్ స్టాలో మీకు అకౌంట్ ఉండగానే సరికాదు.. తెలియని వారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చినా.. పెద్ద తెలీకుండానే హెచ్చులు చూపించే వారి విషయంలోనూ.. తియ్యటి మాటలు చెప్పే వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే.. నిండా మునిగిపోవటం ఖాయం.