రాజీనామా అంటే తమాషా అయిపోయిందా అన్నదే ఇపుడు డౌట్ ఎక్కడో కొడుతోంది అందరికీ. రాజీనామా చేయడం అంటే అందులో ఎంతో సీరియస్ నెస్ ఉండాలి. చిత్తశుద్ధి కనిపించాలి. నిబద్ధత జనాలకు అర్ధం కావాలి. కానీ ఉత్తుత్తి రాజీనామాలు ఇపుడు ఎక్కువ అయిపోయాయి అని అంటున్నారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాలు అని నాయకులు చెబుతారు. కానీ అవి ఎందుకో ఆమోదం పొందవు, మరి తాను చేసిన రాజీనామాను ఆమోదించుకోవాలన్న పట్టుదల కసి చేసిన వారిలో లేదా. లేక వాటిని లైట్ గా తీసుకుంటున్నారా అన్నదే ఇపుడు చర్చ.
ఇదిలా ఉంటే రాజీనామాలు అంటే తెలంగాణా వైపే అంతా చూస్తారు. తెలంగాణా రాష్ట్రాన్ని రాజీనామాలే తీసుకువచ్చాయి అని కూడా చెప్పాలేమో. ఉమ్మడి ఏపీని రెండు ముక్కలు చేయడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అసలు అది జరిగే పనేనా అని కూడా భావించారు. కానీ అలా జరగలేదు. రాజీనామాల అస్త్రాన్ని పదే పదే ఒక వ్యూహం ప్రకారం పట్టుదలతో కేసీయార్ ప్రయోగించారు. అక్కడ తాను చేయడమే కాదు తమ ఎమ్మెల్యేల చేత కూడా చేయించారు. ఫలితంగా రాజీనామాల పవర్ ఏంటో లోకానికి అలా చాటి చెప్పారు.
తెలంగాణా ఉద్యమానికి ఎప్పటికపుడు వేడెక్కించడానికి అలాగే దాన్ని లైమ్ లైట్ లో ఉంచడానికి ఈ రాజీనామాలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. తెలంగాణావాదం జనంలో ఎంతలా ఉందో రాజీనామా చేసి తెచ్చిన ఉప ఎన్నికల్లో ప్రతీసారి మెజారిటీలు పెరిగి రాజకీయాలనే కీలక మలుపు తిప్పాలి. అలా రాజీనామాల వెనక ఉన్న లక్ష్యం ఏంటి దాని బలం ఏంటి అన్నది యావత్తు దేశానికి తెలిసింది.
మరి ఏపీలో చూస్తే సమైక్యాంధ్రా ఉద్యమం రోజుల్లోనూ రాజీనామాలు అన్నారు. కానీ చివరికి జనాలకే నిలువు నామాలు పెట్టారు. ఇపుడు ఏపీలో రాజధాని పేరిట మరో ఉద్యమం రగులుతోంది. ఒకటి కాదు మూడు రాజధానులు అంటున్నారు. మరి మూడు మీద జనం మూడ్ ఏంటి తెలుసుకోవడానికైనా రాజీనామాలు చేయడం జరగాలి. దాని మీద చాలా కాలంగా అటూ ఇటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. అయితే చివరికి మంత్రి గారు ఒకరు రాజీనామా చేయాలని ఉంది దానికి జగన్ అనుమతి కావాలని చెబుతూంటే ఒక ఎమ్మెల్యే హడావుడిగా రాజీనామా చేసేశారు.
అయితే ఈ రాజీనామా అన్నది ఒక డ్రామా అని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజీనామాలు ఉత్తిత్తిగా చేస్తూ జనాలను మభ్యపెడుతున్నారని అంటున్నారు. మరి విపక్షం మాట నిజం చేస్తున్నారా లేక తమషాకు రాజీనామా ప్రహసనాన్ని నడుపుతున్నారా అన్నదే సందేహంగా ఉంది అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు, రాజీనామాలు చేస్తే కచ్చితంగా వాటిని ఆమోదించుకుని జనంలోకి వచ్చి తాము ఏది కోరుకుంటున్నామో దాని మీద నిలబడి ఓట్లు అడగాలి.
ఆ మీదట జనం తీర్పు శిరసా వహించాలి. అంతే తప్ప రాజీనామా చేసేశాను దాన్ని స్పీకర్ గారికి పంపించాను అంటూ టైమ్ పాస్ చేయాలనుకుంటే మాత్రం విపక్షం అన్నట్లుగా అది రాజీడ్రామావే అవుతుంది అంటున్నారు. ఏది ఏమైనా రాజీనామాలతో ఉద్యమాలని ఏలా వేడిక్కించాలో తెలంగాణాను చూసి నేర్చుకోండి అంటున్నారు. అలా రాజీనామాలు చేయాలంటే దమ్మూ ధైర్యం ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరి ఏపీలో ప్రస్తుతం సాగుతున్న రాజీనామా ప్రహసనంలో చిత్తశుద్ధి ఉందా. ఏమో జనాలే దీనికి బదులు చెప్పాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.