ఫెడెక్స్ ఫ్యూచర్ సీఈవో సుబ్రమణియన్ గురించి తెలుసా..?

Update: 2022-03-29 08:30 GMT
అమెరికాలోని ప్రముఖ సంస్థలను ఇండియన్లు ఏలుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ భారతీయ ముద్ర వేస్తున్నారు.  మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ సీఈవో వరకు మన పెత్తనమే నడుస్తోంది.  తాజాగా మరో ప్రవాస భారతీయుడు అమెరికాలోని ప్రముఖ కంపెనీకి సీఈవో గా నియామకమయ్యారు.

అమెరియా మల్టీ నేషనల్ కంపెనీ ఫెడెక్స్ కు రాజ్ సుబ్రమణియన్ సీఈవో బాధ్యతలు చేపట్టనున్నట్లు మల్టీ నేషనల్ కొరియర్ సర్వీస్ మేజర్ తెలిపారు. ప్రస్తుతమున్న ఫెడెక్స్ ఫౌండర్, సీఈవో ఫ్రెడెరిక్ డబ్లు స్మిత్ వచ్చే జూన్లో సీఈవో బధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

భారత్ కు చెందిన రాజ్ సుబ్రమణియన్ 1991లో ఈ కంపెనీలో చేరారు. ఆసియా, అమెరికాలోని పలు మార్కెటింగ్, మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వర్తించారు. తన ప్రతిభా పాటవాలతో అతికొద్ది కాలంలోనే చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ అధికారి స్థాయికి ఎదిగారు. ఈ హోదాలో ఆయన కార్పొరేట్ స్ట్రాటజీ డెవలప్మెంట్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్ ఫోర్టు కంపెనీ అయిన ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో చేరారు. 56 ఏళ్ల సుబ్రమణియన్ కు  36 ఏళ్ల అనుభవం ఉంది.

ప్రెడెరిక్ డబ్లు స్మిత్ ఫెడెక్స్ కంపెనీని 1971లో ప్రారంభించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ హోదాలు మారారు. తన సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కొద్దికాలం కిందట అమెరికాలో చేసిన సర్వే ప్రకారం కంపెనీల్లో పనిచేయడానికి 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో 78 శాతం మంది ఫెడెక్స్ పట్ల ఆసక్తి చూపినట్లు తెలింది.

టెనస్సీలో ఫెడెక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో చేరిన సుబ్రమణియన్ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ సీఈవోగా ఎదిగారు. ముందుగా ఆయన కార్ప్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ గా నియామకమ్యారు.

ఆ తరువాత వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ అధ్యక్షుడిగా 1991లో చేరినప్పటి నుంచి ఆసియా, అమెరికా అంతటా వివిధ విభాగాల్లో పనిచేశారు.
Tags:    

Similar News