ముఖేశ్ అంబానీ మామిడి తోట గురించి తెలుసా..?: ఎక్కడుందో తెలుసా..?

Update: 2022-07-02 07:30 GMT
రిలయన్స్ ఇండస్ట్రీ అంటే ఇప్పటి వరకు మనకు మొబైల్స్, గ్యాస్, పెట్రోల్ గురించి మాత్రమే తెలుసు. టెక్నాలజీ రంగంలో ప్రపంచ సంస్థలతో పోటీ పడుతున్న రిలయన్స్ వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టిన విషయం కొందరికే తెలుసు. 1998నుంచి ముఖేశ్ అంబానీ మామిడితోటను పెంచుతున్నాడు. ధీరుభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ పేరుతో గుజరాత్లోని జామ్ నగర్లో 600 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు అంతేకాకుండా వీటిని  విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ రకాల మామిడి ఇక్కడ పండుతోంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ బిజినెస్ మేన్ గా ఉన్న ముఖేశ్ అంబానీ  మామిడి వ్యాపారిగా కూడా  సక్సెస్ సాధిస్తున్నాడు. ఇంతకీ ముఖేశ్ మామాడి తోట కథేంటి..?

పర్యావరణ సమతుల్యానికి చెట్లను పెంచాల్సిన అవసరం ఉంది. ముఖేశ్ కూడా తన ఇండస్ట్రీ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు మామిడి చెట్లను పెంచాల్సి వచ్చింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రిఫైనరీ ఉంది. దీని నుంచి అధికంగా కాలుష్యం వెలువడుతుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలని నియంత్రణ బోర్డుల నుంచి అనేక నోటీసులు వచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లను నాటడమే పరిష్కారమని రిలయన్స్ ఇండస్ట్రీ భావించింది. ఇందులో భాగంగా 1998 నుంచి మామిడి చెట్లను నాటడం ప్రారంభించింది.

మామిడి మొక్కలను నాటిన తరువాత ప్రతికూలపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ బలమైన గాలులు వీయడం, నీరు ఉప్పగా ఉండడం, భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో ఇవి పెరుగుతాయో లేదోనని అనుమానించారు. కానీ రిలయన్స్ సంస్థ టెక్నాలజీ సాయంతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. ప్రస్తుతం ఈ మామిడి తోట 600 ఎకరాల్లో 1.5 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయి.

ఇందులో 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి  రకాలను పెంచుతున్నారు.  దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోట గా దీనిని పరిగణిస్తున్నారు. ఈ మామిడి తోటకు డిశాలినేషన్ ప్లాంట్ నుంచి నీరు పంపిస్తారు. ఈ ప్లాంట్ సముద్రపు నీటిని శుద్ధి చేసి చెట్లకు పంపిస్తుంది.  కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ రకాలే కాకుండా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి టామీ అట్కిన్స్, కెంట్.. ఇజ్రాయెల్ లోని లిల్లీ, కిట్, మాయ వంటి రకాలను పెంచుతున్నారు.

ధీరుభాయ్ మామిడి తోటలో పండిన మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రిలయన్స్ పెంచే చెట్ల గురించి ఇతర రైతులకు వివరిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రైతులకు లక్ష చెట్లను పంపిణీ చేస్తోంది. తన తోటలో పెంచిన విధంగా రైతులు కూడా పెంచాలని చెబుతున్నారు. మరోవైపు రిలయన్స్ మామిడి పండ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. గుజరాత్ వ్యాప్తంగా ఈ పండ్లను భారీగా కొనుగోలు చేస్తారు. విదేశాల్లోని ఎన్నారైలు ఈ పండ్లను తెగ ముచ్చటపడిపోతారు. అటు ముఖేశ్ అంబానీ కూడా మ్యాంగో లవర్ కావడం విశేషం.

కేవలం మామిడి పండ్లనే కాకుండా ముఖేశ్ జామ, చింతపండు, జీడీ, ట్రెజిలీయన్, చెర్రీ, శెనగలు, పీచు, దానిమ్మ తో పాటు మరికొన్ని ఔషధ చెట్లనుకూడా పెంచుతున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్లో రిఫైనరీ 7,500 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో మొత్తం 1,627 ఎకరాల్లో రకరకాల చెట్లను పెంచుతున్నారు. 10 శాతం మామిడి చెట్లకు వినియోగించగా.. మిగతా ప్లేసులో రకరకాల చెట్లను పెంచుతున్నారు. కాగా తన ప్లాంటేషన్ లో పండించిన మామిడిపండ్లను మార్కెటింగ్ చేయడానికి జామ్ నగర్ ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి సరఫరా చేస్తోంది.
Tags:    

Similar News