చిన్నారిపై రేప్ కేసులో దోషికి.. ఎంత పెద్ద శిక్ష విధించారో తెలుసా? నోరెళ్లబెట్టడం ఖాయం!
రేపిస్టు అంటే.. ఎంత మానవతావాదికైనా.. ఆగ్రహం కలిగించకమానదు. ఎంతటి సౌమ్య శీలికైనా.. కోపం రప్పించకుండా ఉండదు. అయితే.. ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మాత్రం.. ఇలాంటి ఓ రేపిస్టును లైట్ తీసుకున్నారు. చేసింది ఘోరమైన తప్పని తెలిసి కూడా.. కేవలం ఐదు గుంజీలతో సరిపెట్టారు. దీనిపై బాధితురాలి కుటుంబం కన్నీరు మున్నీరైనా `పెద్దలు` మాత్రం తాము అనుకున్నది చేసేశారు.
ఓ అత్యాచారం కేసులో నిందితుడికి గ్రామ పంచాయితీ పెద్దలు విధించిన శిక్ష అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్లో ఓ పంచాయితీ పెద్దలు అత్యాచార నిందితుడికి విధించిన శిక్ష.. న్యాయాన్ని అవహేళన చేసేదిగా ఉందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం జోక్యం చేసుకున్న పంచాయితీ పెద్దలు నిందితుడికి ఐదు గుంజీలను శిక్షగా విధించారు. దీనిపై గ్రామస్థుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్‌లోని నవాదా ప్రాంతం అక్బర్పుర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో.. అరుణ్ పండిట్ అనే వ్యక్తి కోళ్లఫారంలో పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారిని ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బాధితురాలు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా.. కోళ్లఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయితీలో తేల్చుకుందాం అని సూచించాడు.
ఈ విషయంలో జోక్యం చేసుకున్న గ్రామ పెద్దలు నవంబర్ 21న తమ తీర్పును వెల్లడించారు. ప్రజలంతా నిందితుడ్ని పోలీసులకు అప్పగిస్తారని అనుకుంటే పెద్దలు అలా చేయలేదు. నిందితుడికి గ్రామస్థులందరి ముందు.. ఐదు గుంజీలను శిక్షగా విధించి, అతడ్ని విడిచి పెట్టారు. ఈ ఐదు గుంజీల తీర్పు పట్ల గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఇంత పెద్ద విషయాన్ని చిన్న శిక్షతో ఎలా సరిపెడతారని, అధికారులు జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.